ఆగస్టు 29 శనివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

ఆగస్టు- 29- భాద్రపదమాసం- ఏకాదశి. శనివారం. శుక్లపక్షం.

మేష రాశి: ఈరోజు సంతోషంగా ఉంటారు !

ఈ రోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు, ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. సమయాన్ని సదివినియోగం చేఉకోవటంతోపాటు, మీకుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ, దానిని అమలుపరచటంలో విఫలం చెందుతారు. ఎటువంటిఆలోచనలు లేకుండా పనిని ప్రారంభించండి. పని మీద దృష్టిపెట్టండి శ్రద్దగా చేయండి.

పరిహారాలుః  మీ ఆర్థిక ఆరోగ్య మెరుగుదల కోసం సోదరులతో సఖ్యంగా ఉండండి.

todays horoscope

వృషభ రాశి: ఈరోజు ఆరోగ్యంగా బాగుంటుంది !

ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసికస్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మ విశ్వాసంతో ఉందేలాగ చేస్తుంది. జీతాలురాక ఆర్ధిక ఇబ్బంది పడుతున్నవారు ఈరోజు వారి స్నేహితు లను అప్పుగా కొంతధనాన్నిఅడుగుతారు. కుటుంబ సభ్యులు, మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. మీకు బాగా దగ్గరైనవారితో ఈరోజు రాత్రి అంతా ఫోనులో మాట్లాడతారు, మీజీవితంలో ఏం జరుగుతోందో వారితో సంభాషిస్తారు.

పరిహారాలుః  మీ ద్రవ్య పరిస్థితులను మెరుగుపర్చుకోవడానికి ఆకుపచ్చ దానాను గోశాలలో సమర్పించండి.

 

మిథున రాశి: ఈరోజు సంతానం వల్ల ఆనందం !

ఈరోజు మీ ముందుకు వచ్చే క్రొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి. కానీ ఈ ప్రాజెక్ట్ల గురించిన నిబద్ధతను అధ్యయనం చేశాకనే కమిట్ అవండి. మీ సంతానానికి చెందిన ఒకసన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. ఏదో ఒక కారణం వల్లో మీరు వేళకు తయారు కాలేకపోతారు. కానీ మీ జీవిత భాగస్వామి మీకు సాయపడి గట్టెక్కిస్తారు. మీరు ఈరోజు మొతాన్ని వృధా చేసామని భావిస్తారు. కావున , ఈరోజుని మీరు పనికొచ్చేవిధంగా మలుచుకోండి.

పరిహారాలుః మానసిక ఒత్తిడిని వదిలించుకోవటానికి ఉదయాన్నే ధాన్యం, యోగా చేయండి.

 

కర్కాటక రాశి: ఈరోజు ఆర్థికంగా మెరుగుదల !

ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు, బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఆనందంగా, భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు. ఎన్నో ఊసులాడుకుంటారు. మీరు మీ సంతానానికి సహాయసహకారములు అందించుట ద్వారా వారు విజయాలను అందుకుంటారు.

పరిహారాలుః  మీ కుటుంబ జీవితానికి అనుకూలమైన ఫలితాల కోసం ఇష్టదేవత ఆరాధన చేయండి.

 

సింహ రాశి: ఈరోజు మానసిక ప్రశాంతత !

ఈరోజు మీదగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగివుంటారు. దీనివలన మీరు మానసికశాంతిని పొందుతారు. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకొండి. మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను చూపగలవు. జీవితభాగస్వామితో ఆనందంగా గడుపుతారు. సమయాన్ని టీవీ చూడటానికి కేటాయిస్తారు.

పరిహారాలుః గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కోసం ఎరుపు సింధూరం అందించడం ద్వారా మీ కుటుంబం, వ్యక్తిగత దేవతలను పూజించాలి.

 

కన్యా రాశి: ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకోండి !

మీ భావోద్వేగాలను ప్రత్యేకించి కోపాన్ని అదుపు చేఉకోవడానికి ప్రయత్నిం చండి. మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కానీవాటిని మీరు దానధర్మాలకు వినియోగిస్తారు. ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండీ. మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు. కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు. మీరు ఈరోజు మిత్రులతో కలిసి సినిమాలకు, షికారుకు, విందువినోదాలలో పాల్గొంటారు.

పరిహారాలుః మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

 

తులా రాశి: ఈరోజు సమయాన్ని వృథా చేయకండి !

మీరు డబ్బులను పొదుపుచేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది.ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. మీ కరకు స్వభావం మీ తల్లిదండ్రుల ప్రశాంతతను పాడుచేస్తుంది. వారి సలహాలకు మీరు తలఒగ్గవలసి ఉంటుంది. ఈరోజు ఈరాశిగల కొంతమంది విద్యార్థులు వారి సమయాన్ని టీవీ కంప్యూటర్ చూడటంద్వారా సమయాన్ని వృధాచేస్తారు. ఏదో పాత విషయంపై మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు.

పరిహారాలుః వృత్తిలో మంచి వృద్ధి కోసం పేదప్రజలకు దుస్తులు, ఆహార పదార్థాలు ఇవ్వండి.

 

వృశ్చిక రాశి: ఈరోజు ధనలాభం !

కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయి మీ మూడ్ని మార్చుకొండి. మీరు ఈరోజు మీఅమ్మగారి తరుఫు వారి నుండి ధనలాభాన్ని పొందుతారు. పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు ఫలించనుంది. వారాంతంలో కుటుంబంతోకలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నవి. అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నవి.

పరిహారాలుః గోధుమ పిండి, బియ్యం, పాలు, పెరుగు, పంచదార ఒక పేద మహిళకు దానం చేయండి.

 

ధనుస్సు రాశి: ఈరోజు ముదుపు లాభదాయకం !

మీ ఇంటి గురించి ముదుపు చెయ్యడం లాభదాయకం. శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి, మీరు కోపాన్ని అధిగమించాలి. ఈరోజు మీ సాయంత్ర సమయాన్ని మీ సహుద్యోగితో గడుపుతారు. మీ బంధువులు ఈ రోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు. స్నేహితులతో సమయం గడపటం వలన మీరు మీ ఒంటరితనానికి దూరం కావచ్చు. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

పరిహారాలుః ఒక శ్రావ్యమైన కుటుంబ జీవితం కోసం రుద్రాక్షలను ధరించండి.

 

మకర రాశి: ఈరోజు అనవసర ఖర్చులు పెట్టకండి !

అనవసరంగా ఖర్చు పెట్టటం మానుకోండి. డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బంధువులతో మీరు గడిపిన సమయం మీకు, బహు ప్రయోజనకరం కాగలదు. ఈ రోజు ఉదయాన్నే మీరు ఒకటి అందుకుంటారు. దాంతో రోజంతా మీకు అద్భుతంగా గడిచిపోతుంది. ఈరోజుని మీరు చక్కగా సద్వినియోగం చేసుకునట్టు అయితే ఈరోజు ఖాళీ సమయాన్ని ఇతర పనులకు వినియోగించుకోవచ్చు.

పరిహారాలుః గొప్ప ఆరోగ్యం కోసం ధన్వంతరీ స్తోత్రం పారాయణం చేయండి.

 

కుంభ రాశి: ఈరోజు తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్త !

మీ ఆఫీసునుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. మీరు నిజంగా సంతోషం పొందే పనులు చెయ్యండి. ఈరోజు మీరు మీతల్లితండ్రుల ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చుచేయవలసి ఉంటుంది. ఒక సందేశం వలన మీరోజు అంతా సంతోషంతోను, హాయితోను నిండిపోతుంది. జీవిత భాగస్వామితో ఆత్మిక విషయాలను, లోతైన కుటుంబ విషయాలు చర్చిస్తారు.

పరిహారాలుః వ్యాపారం / వృత్తి జీవితం వృద్ధి చెందడానికి నవగ్రహ ప్రదక్షణలు లేదా స్తోత్రం చదవండి.

 

మీన రాశి: ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి !

ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వవలసివస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తాడో రాయించుకుని ఇవ్వండి. ఈరాశికి చెందినవారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు. దీనివలన మీ చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత ఆనందంగా ఉంటుంది. తననుంచి ఈ రోజు మీరు ఓ చక్కని సర్ ప్రైజ్ అందుకోవచ్చు. చిన్నపిల్లలతో గడపటం వలన ఆనందాంగా, ప్రశాంతంగా ఉంటారు.

పరిహారాలుః క్రమం తప్పకుండా స్వచ్ఛమైన తేనెను ఉపయోగించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

 

-శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version