ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్ రిక్రూట్‌మెంట్ 2020కి గాను ఆన్‌లైన్ అప్లికేషన్ల స్వీకరణ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు gswsvolunteer.apcfss.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించి సదరు పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మొత్తం 191 గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ పోస్టులను ఏపీ ప్రభుత్వం భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.
ముఖ్యమైన వివరాలు…
* ఆన్‌లైన్‌లో అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభమైన తేదీ: 28 ఆగస్టు 2020
* ఆన్ లైన్ లో అప్లికేషన్లను సమర్పించేందుకు ఆఖరి తేదీ: 1 సెప్టెంబర్ 2020
* ఖాళీగా ఉన్న పోస్టులు – 191 (Nellore)
* వయస్సు – 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
* ఎంపిక విధానం – అభ్యర్థులను ఎంపీడీవో లేదా తహసీల్దార్ లేదా ఈవోలు ఇంటర్వ్యూలు చేస్తారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉన్నారో లేదో చూస్తారు. గతంలో పనిచేసిన అనుభవం, నాయకత్వ లక్షణాలు, చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్, ఇతర నైపుణ్యాలను పరీక్షిస్తారు.
* https://gswsvolunteer.apcfss.in/ వెబ్‌సైట్‌ను సందర్శించి పోస్టులకు చెందిన అధికారిక నోటిఫికేషన్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
* https://gswsvolunteer.apcfss.in/APVOLUNTEER20/apVolunteer090420201049.vt సైట్‌ను ఓపెన్ చేసి పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు.
ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు అప్లై చేశాక ప్రింటవుట్ తీసుకోవాలి. దాన్ని భవిష్యత్తులో రిఫరెన్స్ కింద వాడుకోవచ్చు.