వేంకటేశ్వరస్వామికి పుష్పాలతో అర్చన చేస్తే ఈరాశలకు అంతా శుభమే! మే 11 రాశిఫలాలు

-

మేషరాశి : అత్యంత అనుకూలం. లాటరీ లాభం, వస్తులాభం, ఆకస్మిక ధనయోగం, భార్యతరపు వారితో సఖ్యత, పనులు పూర్తి, ఆరోగ్యం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన చేసుకోండి సరిపోతుంది.

వృషభరాశి : వ్యతిరేక ఫలితాలు, వాహనాలతో జాగ్రత్త, దుఃఖం, మనస్పర్థలు, కుటుంబంలో అపార్థాలు, స్టాక్ మార్కెట్ అనుకూలంగా ఉండదు, అరోగ్యం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి పుష్పమాల సమర్పణ, దేవాలయ ప్రదక్షిణలు మంచి చేస్తాయి.

May 11th Saturday daily Horoscope

మిథునరాశి : అనుకూలమైన ఫలితాలు, ఉత్సాహం, ఆరోగ్యం, ప్రయాణాలు కలిసి వస్తాయి, సంభాషణలు. పనులు పూర్తి.
పరిహారాలు: ఆంజనేయస్వామి ఆరాధన, సింధూర ధారణ చేయండి.

కర్కాటకరాశి : వాహనాల వల్ల లాభం, ఆనందం, చికాకు, కుటుంబంలో సంతోషం, పనుల్లో జాప్యం. అనారోగ్య సూచన.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి పుష్పాలతో అర్చన చేయించండి.

సింహరాశి : మిశ్రమ ఫలితాలు, స్త్రీ సౌఖ్యం, బంధుమిత్రులతో సంతోషం, కీర్తినాశనం, ఇబ్బందులు, ప్రయాణాలు కలిసిరావు, ఆర్థికంగా అనుకూలం కాదు.
పరిహారాలు: ఆంజనేయస్వామి ఆరాధన, చాలీసా పారాయణం చేయండి.

కన్యారాశి : మిశ్రమ ఫలితాలు, ఉత్సాహం, బంధువులకు అనారోగ్యం, మాటపట్టింపులు. ప్రయాణాలు కలిసిరావు.
పరిహారాలు: హనుమాన్ చాలీసా పారాయణం, దేవాలయ దర్శనం చేయండి.

తులారాశి : వ్యతిరేక ఫలితాలు, ప్రయాణ నష్టం, ఆందోళన, తీవ్ర మనస్తాపం, అనారోగ్య సూచన.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి దేవాలయ దర్శనం, ప్రదక్షిణలు, పుష్పాలతో అర్చన చేయండి.

వృశ్చికరాశి : ప్రతికూలం, వస్తునష్టం, భార్యతో వివాదం, బంధువుల కలయిక, అనారోగ్య సూచన.
పరిహారాలు: విష్ణు ఆరాధన, పూజ మంచి చేస్తాయి.

ధనస్సురాశి : రస్త్రీ సుఖం, బంధువులతో సఖ్యత, ఆరోగ్యం, ప్రయాణాలు కలిసివస్తాయి, పనివారితో చిన్నచిన్న ఇబ్బందులు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి పూజ, ప్రదక్షణలు చేయండి.

మకరరాశి : సంతానంతో కీర్తి, ధనవ్యయం, విందులు, ప్రయాణ సూచన, పనులుపూర్తి.
పరిహారాలు: సింధూర ధారణ, నవగ్రహాలకు ప్రదక్షణ చేయండి.

కుంభరాశి : ప్రయాణాలు కలసిరావు, ఆనందం, సౌఖ్యం, భార్య తరపువారితో సంతోషం, పనులు పూర్తి, చికాకులు.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షణలు, వేంకటేశ్వర ఆరాధన చేయండి.

మీనరాశి : మిశ్రమం, ఆకస్మిక ధనలాభం, ధననష్టం, కుటుంబంలో సంతోషం, విందులు, వినోదం.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి పుష్పార్చన మంచి ఫలితాన్నిస్తుంది.

-కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version