నవంబర్ 25 – డిసెంబర్ 1 రాశిఫ‌లాలు: ఈ రాశి వారు మంచి ఫలితాల కోసం అన్నదానం చేయండి

-

మేషరాశి: ఈ వారం అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలుంటాయి. వ్యాపారులకు అంత అనుకూలంగా ఉండదు. ఆర్థికంగా ఈ వారం బాగుటుంది. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. బంధుమిత్రలతో ప్రతికూలంగా ఉంటుంది. ఈవారం మంచి ఫలితాలను పొందడానికి కార్తీక పూజలు, అభిషేకాలు, శివ, విష్ణు ఆరాధనలు చేయండి. మంచి ఫలితాలు లభిస్తాయి.

వృషభరాశి: అనుకూలమైన వారం. చిన్నచిన్న సమస్యలు వచ్చినా వాటిని దాటి విజయం సాధిస్తారు. ఆర్థికంగా బాగుటుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాలు కొంత ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పనులను చేసేటప్పుడు దైవం మీద భారం వేసి చేయండి. విద్యార్థులకు, వ్యాపారులకు బాగుటుంది. ఈ రాశి వారు మంచి ఫలితాలను పొందడానికి నవగ్రహ ప్రదక్షిణలు, విష్ణు ఆరాధన చేయండి. కార్తీక దామోదరుడి పేరుతో దానాలు చేయండి విశేష ఫలితం ఉంటుంది.

మిథునరాశి: ఈవారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం. బంధుమిత్రులతో సత్సంబంధాలు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాలు అనుకూలం. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారం మంచి ఫలితాలను పొందడానికి కార్తీక దీపారాధన, దానాలు, విష్ణు సహస్రనామ పారాయణం/శ్రవణం, శివాభిషేకాలు చేయండి.

కర్కాటకరాశి: ఈవారం చాలా బాగుంటుంది. దైవశక్తి మిముల్ని కాపాడుతుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులకు, విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగస్తులు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. బంధుమిత్రుల సహాయసహకారాలు అందుతాయి. పురుష ప్రయత్నంతోడుగా ఇష్టదేవతారాధన, భగవన్నామ పారాయణం/శ్రవణం మంచి ఫలితాలను ఇస్తుంది.

సింహరాశి: ఈరాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. కుటుంబంలో సంతోష వాతావరణం. వ్యాపారస్తులకు, విద్యార్థులకు అనకూల సమయం. ఉద్యోగస్తులకు అనుకూలం. కొన్ని గ్రహాల ప్రతికూలతలు ఉన్నాయి. వీటిని అధిగమించడానికి దేవాలయ సందర్శన, ప్రదక్షిణలు చేయండి. అన్నదానం చేయండి మంచి ఫలితం వస్తుంది.

కన్యరాశి: ఈరాశి వారికి శుభకాలం. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా మంచి కాలం.
ఉద్యోగస్తులకు, వ్యాపారులకు, విద్యార్థులకు మంచి సమయం. కుటుంబంలో సంతోషవాతావరణం ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. చిన్నచిన్న అవాంతరాలు ఉన్నా అధిగమిస్తారు. ఏ పనిచేపట్టినా పట్టుదలతో చేయండి. విజయం మీ సొంతం. ఈ వారం విశేష ఫలితాల కోసం మాసశివరాత్రి అభిషేకం, విష్ణువుకు తులసిమాలతో అర్చన చేయించండి.

తులారాశి: ఈవారం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు, విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మీ పనుల్లో ఇతరులు జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. వారికి దూరంగా ఉండండి. సొంత నిర్ణయాలు తీసుకోండి. దేవీ ఆరాధన, హనుమాన్ చాలీస్ పఠనం మంచి ఫలితాలను ఇస్తాయి.

వృశ్చికరాశి: ఈ వారం ప్రతికూల వాతావరణం ఉంటుంది. అయినా భయపడవద్దు. దైవబలం మీ వెంట ఉంటుంది. చేసే పనుల్లో శ్రద్ధ పెట్టండి. కొత్త పనులు ప్రారంభించకండి. ఆర్థికంగా మిశ్రమకాలం. ఉద్యోగస్తులకు, వ్యాపారులకు, విద్యార్థులు బాగా శ్రమించాల్సిన వారం. కార్తీక దీపారాధన, శివాభిషేకాలు, లక్ష్మీదేవి పూజలు చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

ధనస్సురాశి: ఈరాశివారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఉంటాయి. కొన్ని గ్రహాలు ప్రతికూలత వల్ల పనుల్లో ఆటంకం ఉన్నా బుద్ధిబలంతో అధిగమిస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. బంధువులు, మిత్రులతో సఖ్యత. శుభకార్య సూచన. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. మీ అంతర్మాత ప్రబోధం ప్రకారం నడుచుకోండి. ఆర్థిక విషయాల్లో మిశ్రమంగా ఉంటుంది. ఈ వారం మంచి ఫలితాలను పొందడానికి కార్తీకమాస పూజలు, అభిషేకాలు, గోపూజ చేయండి.

మకరరాశి: ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన, చేసే పనులలో కీర్తి లభిస్తుంది. ఆర్థికంగా బాగుటుంది. కుటుంబ సౌఖ్యం, బంధుమిత్రుల సహాయ, సహకారాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం. రాజకీయ, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారం మరిన్ని విశేష ఫలితాలు పొందడానికి దేవాలయ సందర్శన, గోపూజ చేయండి.

కుంభరాశి: ఈ వారం అనుకూల వాతావరణం. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. చేపట్టిన పనుల్లో విజయాలు మీ సొంతం. కుటుంబ సౌఖ్యం. బంధుమిత్రలతో అనుకూల వాతావరణం.
ఉద్యోగస్తులకు, వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూల సమయం. ఆర్థిక అభివృద్ధికి కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం. మరిన్ని మంచి ఫలితాల కోసం సూర్య నమస్కారాలు, అన్నదానం చేయండి.

మీనరాశి: ఈ వారం గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని చిన్నచిన్న అవాంతరాలు వచ్చినా అధిగమిస్తారు. పట్టుదలతో పనులు చేయండి. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు మంచి కాలం. పెట్టుబడులు పెట్టడానికి, వాహనాలు కొనడానికి అనుకూలం. కుటుంబ సౌఖ్యం, బంధువుల సహాయ సహకారాలు అందుతాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. విశేష ఫలితాల కోసం కార్తీక స్నానం, దీపారాధన, గోపూజ, అన్నదానం చేయండి.

నోట్: అన్నదానం అంటే భారీగా ఖర్చు చేయాలన్న అపోహ వీడండి. మీ స్థోమతను బట్టి చేయండి. అన్నదానాలు చేసే సత్రాలకు సంస్థలకు విరాళం ఇచ్చినా లేదా ఐదురూపాయల భోజనం పథకం దగ్గరకు వెళ్లి మీకు చాతనైనంత ఇచ్చి కొందరికి ఉచితంగా భోజనం పెట్టించినా మంచి ఫలితం వస్తుంది. లోభత్వం చేయకుండా పది రూపాయల నుంచి మీ శక్తి మేరకు చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version