గుంటూరు జిల్లాలలో రిజిస్ట్టేషన్ ఆఫీసులు రియల్ అమ్మకాలతో రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నాయి. కొనుగోలు, విక్రయదారులతో అవి కళకళలాడుతున్నాయి. భవిష్యత్తులో కచ్చితంగా గుంటూరు ఐటీ రంగానికి అనుగుణంగా ఎదుగుతుందని.. హైదరాబాద్ లో ఉన్న హైటెక్ సిటీ లాగా ఈ ప్రాంతం కూడా బాగా డెవలప్ మెంట్ ఉంటుందని అందరూ ఊహిస్తున్నారు. గుంటూరు, విజయవాడ, తెనాలి పదేళ్ల క్రితమే కమర్షియల్ గా అన్ని హంగులతో బాగా అభివృద్ధి చెందాయి. ఈ మూడు పట్టణాలు పక్కపక్కనే ఉండటంతో జంట నగరాల లాగా ట్రై సిటీ గా డెవలప్ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.
గుంటూరు, విజయవాడ సిటీ లను అనుసంధానం చేస్తూ అవుటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన కూడా ఉంది. మెట్రో లైన్ ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. అందుకే రియల్ ఎస్టేట్ వ్యాపారులు గుంటూరు భూములను కమర్షియల్ గా మార్చేశారు. ఇక నిన్న మొన్నటి దాకా పంట పొలాలుగా దర్శనమిచ్చిన ప్రాంతం నేడు రియల్ వెంచర్లతో దర్శనమిస్తోంది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చని పంట పొలాలు కాస్తా ఇప్పడు రియల్ ఎస్టేట్ వెంచర్లతో బాగా బిజీగా మారిపోయాయి. ఇప్పటికే అక్కడ గజం ధర 50 వేలు దాకా పలుకుతుందంటే ఆశ్చర్యం కలగక తప్పదు.
గుంటూరు జిల్లాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతికి దగ్గరలో ఉన్న నర్సరావు పేట, చిలకలూరి పేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మంగళగిరి, తాడేపల్లి వంటి ప్రాంతాలలో భూములకు మామూలు డిమాండ్ లేదనే చెప్పాలి. ఆ ప్రాంతాల్లో ఎకరం భూమి ఏకంగా కోటి రూపాయలకు పైగా పలుకుతోందని సమాచారం తెలుస్తుంది. పైగా విదేశాలలో ఉన్న తెలుగువారు కూడా రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని.. మరిన్ని ఐటీ కంపెనీలకు హబ్గా రాజధాని ప్రాంతం డెవలప్ కానుందని తెలుస్తుంది. అందువల్ల గుంటూరు ప్రాంతంలో భూమికి భారీ డిమాండ్ అనేది ఏర్పడింది.