కేటీఆర్ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి స్ట్రాంగ్ కౌంటర్..!

-

బీజేపీకి కోపం వస్తుందని కేసీఆర్ అసలు విషయాన్ని వదిలేసి అన్ని మాట్లాడారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అసెంబ్లీలో ఇవాళ కేటీఆర్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సీనియర్ సభ్యుడు అని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం మూసీ మెట్రోకు నిధులు ఇవ్వలేదన్నారు. మేము అడుగుతున్నవన్నీ హక్కుగా రావాల్సినవే అన్నారు. ఢిల్లీలో యుద్దం చేస్తామన్నారు.. చేశారా..? అని ప్రశ్నించారు.

కనీసం మాటైనా అడిగారా. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోంది. మేము బీజేపీతో కలవడం ఏంటీ అని ప్రశ్నించారు. సభా నాయకుడిని అనుభవం లేదని కేటీఆర్ పేర్కొనడం హాస్యా స్పదమన్నారు. ఏడు మండలాల అంశం లేకుండానే రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందింది. ఏడు మండలాల గురించి మీరేం చేశారని ప్రశ్నించారు. రూ.8వేల కోట్లు ఖర్చు చేసినా ఖమ్మం జిల్లాకు ఏమిచ్చారని ప్రశ్నించారు. రాజకీయాలు పక్కకు పెట్టి ప్రభుత్వంతో కలిసి రండి అని కోరారు. ITIR అనేది హైదరాబాద్ నగరానికి చాలా అవసరమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version