ఈ నెల 26న స్పేస్‌ఎక్స్‌ ‘పోలారిస్‌ డాన్‌’ ప్రయోగం

-

ప్రైవేటు రంగ అంతరిక్ష సంస్థ స్పేస్‌ ఎక్స్‌ మరో ప్రయోగానికి సిద్ధమైంది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్‌వాక్ను నిర్వహించనుంది. ‘పోలారిస్‌ డాన్‌’ పేరుతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు కింద ఆగస్టు 26న నలుగురు వ్యోమగాములను స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్‌ క్యాప్సుల్‌ సాయంతో భూకక్ష్యలోకి పంపనుంది. ఫ్లోరిడాలో కెన్నడీ స్పేస్‌ సెంటర్‌లో ఫాల్కన్‌-9 రాకెట్‌ను వినియోగించనున్నారు. ఈ మొత్తం మిషన్‌కు వ్యాపారవేత్త జేర్డ్‌ ఇస్సాక్‌ మన్‌ నేతృత్వం వహిస్తున్నారు.

అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ మాజీ ఉద్యోగి స్కాట్‌ కిడ్‌ దీనికి పైలట్‌గా వ్యవహించనుండగా.. స్పేస్‌ ఎక్స్‌లో ఉద్యోగులైన ఇంజినీర్స్ సారా గిల్లి, అన్నా మెనోన్‌ ఈ ప్రాజెక్ట్లో పాల్గొననున్నారు. ఈ మిషన్‌ భూమికి దాదాపు 700 కిలోమీటర్ల ఎత్తులోకి వ్యోమగాములను తీసుకెళ్లి, భూ ప్రదక్షిణ చేయనుంది. పోలారిస్‌ మిషన్‌లో తలపెట్టిన మూడు మానవసహిత యాత్రల్లో ఇది మొదటిది. మూడు యాత్రలకు ఇస్సాక్‌మన్‌ నిధులను సమకూరుస్తున్నారు. అంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు త్వరలోనే స్పేస్‌ ఎక్స్‌ పోలారిస్‌ డాన్‌ ప్రయోగానికి సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version