ఈ మధ్యకాలంలో భార్యల కోసం ఏదైనా చేస్తున్నారో భర్తలు. కొంతమంది… భార్యలు ఏది అడిగినా కొనిస్తున్నారు. మరి కొంతమంది కొత్త చీరలు, బంగారం కొనుగోలు చేసి తమ భార్యలను.. చక్కగా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరి కొంత మంది… తమ భార్యలకు గుడులు కూడా పడుతున్నారు. ఇప్పటికే చాలామంది తమ భార్యల కోసం గుడిలు కట్టిన సంఘటనలు మనం చూసాం.
అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సంఘటన చోటుచేసుకుంది. భార్య కోసం ఏకంగా గుడి కట్టించాడు భర్త. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో చోటు తీసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.వాస్తవానికి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన కుడికాల రమేశ్ భార్య సరస్వతి ఏడాది క్రితం మృతి చెందిందట. కొన్ని అనివార్య కారణాల వల్ల కుడికాల రమేశ్ భార్య సరస్వతి మరణించింది. ఇక దీంతో భార్య మీద ప్రేమతో ఆమె జ్ఞాపకార్థం భర్త రమేశ్ విగ్రహాన్ని చేయించి గుడి కట్టించాడు. ఈ సంఘటన వైరల్‌గా మారింది.