కరోనా లాక్డౌన్ కారణంగా ఇప్పటికే పలు వీడియో స్ట్రీమింగ్ యాప్స్ యూజర్లకు ఉచితంగా కంటెంట్‌ను వీక్షించే వెసులుబాటు కల్పించాయి. ఇక ఎయిర్టెల్ కూడా తన ఎక్స్‌స్ట్రీం యాప్‌లో కిడ్స్ కంటెంట్‌ను ఉచితంగా వీక్షించవచ్చని ప్రకటించింది. అయితే ఇప్పుడు ఎయిర్టెల్ తాజాగా మరొక బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది.
ఎయిర్టెల్ తన కస్టమర్లందరికీ జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు గాను వారు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌లో డిస్కవర్ ఎయిర్టెల్ థ్యాంక్స్ సెక్షన్ లో ఉండే బెనిఫిట్స్లోని ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంతో జీ5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఇక ఈ ఆఫర్ కింద జూలై 12వ తేదీ వరకు ఎయిర్టెల్ కస్టమర్లు ఆ సబ్‌స్క్రిప్షన్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
అయితే ఇప్పటికే జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించే వారికి ఈ ఆఫర్ వర్తించదు. కాగా ఆఫర్‌ను ఉపయోగించుకునేందుకు గాను వినియోగదారులు తమ ఫోన్ నంబర్‌ను జీ5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ కు ఇవ్వాల్సి ఉంటుంది.