ప్రముఖ సోషల్ మీడియా నెటవర్కింగ్ యాప్ ఫేస్బుక్లో మరో సెక్యూరిటీ బగ్ తలెత్తింది. యూజర్లు ఎవరిదైనా ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఆటోమెటిక్‌గా వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ వెళ్లిపోతోంది. ఈ లోపాన్ని స్వయంగా గుర్తించిన ఫేస్బుక్.. దీనిపై వినియోగదారులకు క్షమాపణలు చెప్పింది. ఇటీవలి అప్డేట్లో ఈ లోపం ఏర్పడినట్లు తెలిపింది.
గత వారం యూజర్లు ఓపెన్ చేసిన ప్రతి ప్రొఫైల్‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ వెళ్లిపోయింది. దీనిపై అనేక మంది సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేయడంతో మెటా రెస్పాండ్ అయింది. వెంటనే సమస్యను గుర్తించి చర్యలు చేపట్టింది. యాప్ అప్డేట్ తర్వాత ఈ సెక్యూరిటీ లోపం తలెత్తినట్లు వెల్లడించింది. సమస్యను పరిష్కరించినట్లు స్పష్టం చేసింది.
“ఇటీవలి యాప్ అప్డేట్లో బగ్ గుర్తించాం. దీని వల్ల పొరపాటున ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వెళ్లాయి. దీంతో కొంతమంది యూజర్లకు ఇబ్బందులు తలెత్తాయి. అందుకు క్షమాపణల కోరుతున్నాం. ఈ బగ్‌ను సరిచేశాం.”
-మెటా ప్రతినిధి