అంతర్జాతీయ కంపెనీలు వరుసగా ఉద్యోగాలకు కోతలు పెడుతున్నాయి. తాజాగా బ్రిటిష్ టెలికం దిగ్గజం వోడాఫోన్ 11,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించింది. వచ్చే మూడేళ్లలో ఈ లే ఆఫ్స్ ఉంటాయని నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ మఖేరిటా తెలిపారు. తమ పనితీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదని, మార్పులు తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. కస్టమర్లు, సింప్లిసిటీ, వృద్ధి.. ఇదే తమ ప్రాధాన్యతలు అని వివరించారు.
కస్టమర్ల సేవలో అనుభవాన్ని పెంచేందుకు పునర్నిర్మానంపై దృష్టి పెడతామని ప్రకటించింది. అయితే కంపెనీ షేరు ధర రెండు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయిన సమయంలో ఈ నిర్ణయం వెలువేడడం గమానార్హం. అయితే వోడాఫోన్ నిర్ణయం భారత్ లోని వోడా ఐడియా ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం పడదు.