గూగుల్‌ క్రోమ్‌లోని ఈ సీక్రెట్‌ ఫీచర్స్‌ తెలుసా?

-

గూగుల్‌ క్రోమ్‌లోని కొన్ని సీక్రెట్‌ ఫీచర్లు మీరెప్పుడూ ప్రయత్నించి ఉండరు. గూగుల్‌ క్రోమ్‌ ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యం ఉన్న ఇంటర్నెట్‌ బ్రౌజర్‌. దీని వాడకం సులభతరం కావడం వల్ల ఇది ప్రముఖ్యత చెందింది. ఇది మనందరికీ పరిచయమై పదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఈ సరికొత్త ఫీచర్లను చే ర్చింది. వినియోగదారులకు తెలియని అద్భుతమైన ఫీచర్లను అందించనుంది.

 

  • గూగుల్‌ క్రోమ్‌ ఆడియో, వీడియో ఫైల్స్‌ను కూడా ప్లే చేయగలదు. ఆడియో లేదా వీడియో ఫైల్‌ను క్రొత్త ట్యాబ్‌లోకి డ్రాగ్‌ చేయాలి.
  • క్రోమ్‌లో ఇన్‌బిల్ట్‌ మాల్వేర్‌ స్కానర్‌ ఉంటుంది. దీని కోసం సెట్టింగ్స్‌కు వెళ్లి అడ్వాస్డ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ సిస్టమ్‌ రీసెట్‌ చేసి కంప్యూటర్‌ను క్లీనప్‌ చేయవచ్చు. ఇది మీ కంప్యూటర్‌ను స్కాన్‌ చేసి వైరస్‌ను తొలగిస్తుంది.
  • మీ స్నేహితుడు మీ కంప్యూటర్‌ను కొంతకాలం పాటు వాడుకోమని ఇచ్చినపుడు, వారు మీ బ్రౌజింగ్‌ హిస్టరీని తెలుసుకోకుండా ఉండేందుకు క్రోమ్‌లో గెస్ట్‌ మోడ్‌ అనే అద్భుతమైన ఫీచర్‌ ఉంది. గూగుల్‌ క్రోమ్‌ కుడివైపు పైన మూలలోని గూగుల్‌ అకౌంట్‌ అవతార్‌పై క్లిక్‌ చేసి, గెస్ట్‌ మోడ్‌ను ఎంచుకోవాలి. దీనివల్ల మన బ్రౌజింగ్‌ హిస్టరీ ఇతరులు చూడలేరు.
  • సాధరణంగా ఏదైనా కంటెంట్‌ చదివేటపుడు యాడ్స్‌ తెగ ఇబ్బంది పెడుతుంటాయి. దీనివల్ల మనకు డిస్టర్బ్‌ అవుతుంది. గూగుల్‌ క్రోమ్‌లో రీడర్‌ మోడ్‌ను అందించారు. దీని ద్వారా ఎంటువంటి యాడ్స్‌లేని కంటెంట్‌ను చదువుకోవచ్చు. రీడర్‌ మోడ్‌ను ప్రారంభించడం కోసం మీరు చేయాల్సిందల్లా.. క్రోమ్‌లో కొత్త ట్యాబ్‌ను తెరిచి chrome: // flags / # enable& reader & mode అని టైప్‌ చేసి రీడర్‌ మోడ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • ట్యాబ్‌పై రైట్‌–క్లిక్‌ చేసి, ‘యాడ్‌ టు న్యూ గ్రూప్‌’ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే. తద్వారా, మీ గ్రూప్‌కి ట్యాబ్‌లను జోడించవచ్చు లేదా తీసివేయవచ్చు
  • కంప్యూటర్‌లో ఓపెన్‌ చేసిన ట్యాబ్‌లను టాబ్లెట్‌ లేదా స్మార్ట్‌ఫోన్ లో ఏకకాలంలో ఓపెన్‌ చేయవచ్చు. అడ్రస్‌ బార్‌లోని URL ను రైట్‌ క్లిక్‌ ఇచ్చి ‘‘సెండ్‌ టు యువర్‌ డివైజెస్‌’’ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. అయితే, మీ కంప్యూటర్‌లో ఏ గూగుల్‌ అకౌంట్‌ అయితే వినియోగిస్తున్నారో.. అదే అకౌంట్‌ను ట్యాబ్‌, స్మార్ట్‌ఫోన్‌లోనూ ఉపయోగించాలి.
  • మీ క్రోమ్‌ని మూసివేయడం ద్వారా, అప్పటికే తెరిచి ఉన్న అన్ని ట్యాబ్‌లు కూడా ఆటోమేటిక్‌గా మూసివేయపడతాయి. కానీ, వాటిని రీస్టోర్‌ చేసుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. దీని కోసం మీరు మెనూ ఓపెన్‌ చేసి సెట్టింగ్స్‌కు వెళ్లండి. అక్కడ మీకు ఆన్‌–స్టార్ట్‌–అప్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • క్రోమ్‌ రైట్‌సైడ్‌ మూడు చుక్కలపై క్లిక్‌ చేయడం ద్వారా, మీరు క్యాస్టింగ్‌ ఆప్షన్‌ ఎంపికను చూడవచ్చు. మీరు మీ బ్రౌజర్‌ ట్యాబ్‌లను లేదా డెస్క్‌టాప్‌ను క్రోమ్‌ కాస్ట్‌ డివైజ్‌లో స్ట్రీమింగ్‌ చేయాలనుకుంటే ఈ ఆప్షన్‌ను ఎంచుకోండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version