ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాలీ సేల్.. ఫోన్లు, టీవీల‌పై ఆఫ‌ర్లు..!

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ దీపావళి పండుగ సంద‌ర్భంగా బిగ్ దివాలీ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ శ‌నివారం నుంచి అందుబాటులోకి వ‌చ్చింది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ప్ల‌స్ మెంబ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ సేల్ అందుబాటులో ఉంది. ఆదివారం నుంచి అంద‌రికీ అందుబాటులోకి వ‌స్తుంది. ఇక ఈ సేల్ న‌వంబ‌ర్ 13వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, వియ‌ర‌బుల్స్‌, టీవీలు, ఇత‌ర ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌పై ఆఫ‌ర్ల‌ను, రాయితీల‌ను అందిస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్‌, సిటీ బ్యాంక్‌, ఐసీఐసీఐ, కోట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ కార్డు హోల్డ‌ర్లు వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తే 10 శాతం అద‌న‌పు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు.

సేల్‌లో ఐఫోన్ ఎక్స్ఆర్ 64జీబీ మోడ‌ల్‌ను రూ.38,999 ధ‌ర‌కు కొన‌వ‌చ్చు. ఐఫోన్ ఎస్ఈ 64జీబీ ని రూ.32,999 ధ‌ర‌కు, శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ప్ల‌స్ ను రూ.54,999 కు, గెలాక్సీ నోట్ 10 ప్ల‌స్‌ను రూ.59,999కు, ఐఫోన్ 11 ప్రొ ను రూ.79,999కు, పోకో ఎం2 ప్రొను రూ.12,999కు కొనవచ్చు. అలాగే మోటో జి9 ఫోన్‌పై కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు.

సేల్‌లో ఫిలిప్స్ 4కె స్మార్ట్ టీవీలు, అసుస్ వివో బుక్ 14 ల్యాప్ టాప్ లు, యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రొ, జేబీఎల్ సౌండ్ బార్స్ ను కూడా త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొన‌వచ్చు. మ‌రిన్ని వివ‌రాల‌కు ఫ్లిప్‌కార్ట్ సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.