గూగుల్‌ మీట్‌ సూపర్‌ ఫీచర్‌…. ఇక లైవ్‌ స్ట్రీమింగ్‌ కూడా..!

-

కరోనా కారణంగా ఆన్‌లైన్‌ మీటింగ్‌లు పెరిగాయి. దీంతో ఆన్‌లైన్‌ మీటింగ్‌ యాప్స్‌కు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ఒకటి మరోటి పోటీ ఇస్తూ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. తాజాగా గూగుల్‌ మీట్‌(google meet) లో సూపర్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక నుంచి లైవ్‌ స్ట్రీమింగ్‌ కూడా ఇచ్చుకోవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం. తాజాగా తన ‘గూగుల్‌ మీట్‌’లో రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో క్రాస్‌ డొమైన్ లైవ్‌ స్ట్రీమ్‌ ఒకటి, మరోటి క్యాప్షన్.

గూగుల్‌ మీట్‌ /google meet

ఫీచర్లు పనిచేసే విధానం

ఇక గూగుల్‌ మీట్‌ను వాడుతున్నప్పుడు మొత్తం వీడియో ఫుటేజ్‌ లైవ్‌ స్ట్రీమ్‌ను చేస్తే ఇకపై ఎవరైనా చూడొచ్చు. గతంలో అయితే కేవలం గూగుల్‌ మీట్‌లో కాల్‌/కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నప్పుడు సొంత ఆర్గనైజేషన్ కి సంబంధించిన గెస్ట్‌లు మాత్రమే చూడగలిగేవాళ్లు. ఈ మేరకు గూగుల్‌ తన బ్లాగ్‌లో వివరించింది. ఇక రెండో ఫీచర్‌తో ..లైవ్‌ స్ట్రీమింగ్‌ జరుగుతున్నప్పుడు ఆ మాటల్ని అప్పటికప్పుడు అక్షరాల రూపంలో ఇవ్వడానికి లైవ్‌ స్ట్రీమ్‌ క్యాప్షన్స్‌ అంటారు. అంటే..గూగుల్‌ మీట్‌ వాడినప్పుడు ఆటోమేటిక్‌గా క్యాప్షన్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇంగ్లిష్, జర్మన్ , ఫ్రెంచ్, స్పానిస్‌ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ముఖ్యంగా బధిరులకి ఈ లైవ్‌ క్యాప్షన్స్‌ ఫీచర్‌ బాగా ఉపయోగకరంగా ఉంటుందని గూగుల్‌ చెబుతోంది.గూగుల్‌ ఒక్కో మీటింగ్‌లో గరిష్టంగా లక్ష మంది వినియోగదారులు ఉంటారని గూగుల్‌ చెబుతోంది. ఇది ఆ సంస్థలు/డొమైన్లు తీసుకున్న ప్లాన్స్‌ బట్టి ఉంటుంది. ప్రస్తుతం గూగుల్‌ మీట్‌ను వెబ్, మొబైల్‌ డివైజ్‌లో వాడుకోవచ్చు. త్వరలో మరికొన్ని ఆప్షన్లు తీసుకొస్తున్నారు.జీమెయిల్‌లో ఇంటిగ్రేషన్ ఇప్పటికే పూర్తయింది. ఇక గూగుల్‌కు సంబంధించిన మరిన్ని కీలక యాప్స్‌లో మీట్‌ను ఇంటిగ్రేట్‌ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version