సాధారణంగా ఉపాధ్యాయుడు అంటే పది మందికి మార్గనిర్దేశకుడు. టీచర్ చెప్పే విద్యాబుద్దులు విద్యార్థుల భవిష్యత్ ను ఎంతో ప్రభావితం చేస్తాయి. చాలా మంది విద్యార్థులను ఉపాధ్యాయులు ఉన్నత స్థానాల్లో నిలబెట్టారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు కామాంధులుగా, తాగుబోతులుగా మారుతున్నారు. ఇలాంటి ఉపాధ్యాయులు చేస్తున్న పనికి విద్యావ్యవస్థకే మాయని మచ్చగా కనిపిస్తోంది.
విద్యాబుద్దులను నేర్పించాల్సిన ఓ ఉపాద్యాయుడు మద్యానికి బానిసై విద్యా వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొచ్చాడు. ఈ ఘటన సూర్యపేట జిల్లా మోతె మండలం రామాపురం తండాలో చోటు చేసుకుంది. రామాపురం తండాలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా గత మూడేళ్లుగా పని చేస్తున్నాడు ఉపేందర్. ఈ ఉపాధ్యాయుడికి మద్యం లేనిది పూట గడవదు. ప్రతి రోజు పాఠశాలలో మద్యం, దూమపానం ఉండాల్సిందే. నిత్యం ఫూట్ గా తాగి తరగతి గదిలోనే పడుకుంటాడు. దీంతో విద్యార్థులకు దిన దిన గండంలా మారిన ఉపాధ్యాయుడు ఉపేందర్ ను సస్పెండ్ చేయాలని గ్రామస్తులు, విద్యార్థులు పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినప్పటికీ ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఈ ఘటన పై ఉన్నతాధికారులు స్పందించి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.