వాట్సాప్ నుంచి మీ స్టోరేజీని కాపాడుకోండిలా…

-

ప్ర‌స్తుతం స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్ర‌తి ఒక్క‌రికీ వాట్సాప్ ఉండ‌డం స‌హ‌జం. మార్కెట్లో ఎన్ని మెసేజింగ్ యాప్‌లు ఉన్నా వాట్సాప్ క్రేజే వేరు. ఎందుకంటే వినియోగదారుడి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను వారు అందుబాటులోకి తెస్తూనే ఉంటారు. అయితే ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ అయిన వాట్సాప్‌ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఉండే ప్రధాన సమస్య స్టోరేజీ. ఎందుకంటే వాట్సాప్‌లో మనకు ఎన్నో ఫొటోలు, వీడియోలు వస్తుంటాయి. అందులో అవసరమైనవీ, అనవసరమైన‌వి కూడా ఉంటాయి.

అసలు సమస్య ఎక్కడంటే, అవసరమైనవి 10% ఉంటే, అనవసరమైనవి 90% ఉన్నప్పుడే. ఈ అనవసరమైన ఫొటోలు, వీడియోలే ఎక్కువ స్టోరేజ్‌ తినేస్తాయి. వీటిని ఒకేసారి డిలీట్‌ చేయడమూ కష్టమే. ఎందుకంటే ఒకేసారి చాలా ఎక్కువై పోతాయి. కొన్ని ట్రిక్స్‌ను ఫాలో అయ్యి వాట్సాప్‌లో మీ స్టోరేజ్‌ తినేయకుండా చేయవచ్చు. మ‌రి అది ఎలాగో ఓ లుక్కేయండి..


ఫ‌స్ట్ మీ వాట్సాప్‌ ఓపెన్‌ చేసి, కుడివైపు పైభాగాన ఉండే మూడు చుక్కల గుర్తుపై క్లిక్‌ చేయాలి. అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్లి, చాట్స్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీకు ‘మీడియా విజిబిలిటీ’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే వాట్సాప్‌లో వచ్చే ఫొటోలేవి మీ గ్యాలరీలో కనిపించవు. దీంతో వాట్సాప్ నుంచి మీ స్టోరేజీని కాపాడుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version