AI ఎఫెక్ట్.. డేంజర్ జోన్​లో ఉన్న ఉద్యోగాలు ఇవే

-

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల మానవ మనుగడకే ముప్పని ఇప్పటికే ఎంతో మంది టెక్ నిపుణులు చెబుతున్నారు. ఏఐ వల్ల రానున్న రోజుల్లో ఎంతో మంది ఉద్యోగాలు పోతాయంటే కొన్నేళ్ల కిందట వరకు ఎవరూ నమ్మలేదు. కానీ ఎప్పుడైతే చాట్​బాట్​ చాట్​జీపీటీ రంగ ప్రవేశం చేసిందో అప్పటి నుంచి అందరిలో భయం షురూ అయింది. దీనివల్ల వివిధ రంగాల్లో కోట్లాది మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రభావం వల్ల ఏ రంగంలోని ఉద్యోగాలకు ముప్పు ఉందో ఓసారి తెలుసుకుందామా..?

ఏఐ వల్ల ప్రభావితమయ్యే ఉద్యోగాలు ఇవే..

  • ఎంట్రీ లెవల్ అడ్మిన్ రోల్స్
  • డేటా ఎంట్రీ క్లర్క్స్
  • సాఫ్ట్​వేర్​ ఇంజినీర్స్, కోడర్స్
  • కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్
  • లీగల్ అసిస్టెంట్స్
  • జర్నలిజంపై ప్రభావం
  • గ్రాఫిక్ డిజైనర్స్
  • ఫ్యాక్ట్ చెకర్స్, ప్రూఫ్ రీడర్స్

ప్రస్తుతానికైతే కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం లేదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు, ఏఐ టూల్స్ అభివృద్ధి చేస్తున్న వ్యాపారవేత్తలు అంటున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో నాలుగైదేళ్లలో మాత్రం కృత్రిమ మేధ వల్ల ఉద్యోగులకు సమస్యలు తప్పకపోవచ్చని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version