టెక్నో నుంచి మొట్టమొదటి ల్యాప్‌టాప్ విడుదల అయింది. టెక్నో మెగాబుక్ టీ1 పేరుతో కంపెనీ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. దీని ధర ఎంత అని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఐఎఫ్ఏ 2022 బెర్లిన్ ఈవెంట్లో కంపెనీ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం, 16 జీబీ వరకు ర్యామ్, 70Whr బ్యాటరీతో ఈ ల్యాప్‌టాప్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా 17.5 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది. ల్యాప్‌టాప్‌కు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి..
షాంపేన్ గోల్డ్, మోనెట్ వయొలెట్, రోమ్ మింట్, స్పేస్ గ్రే కలర్ ఆప్షన్లలో ఈ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. అయితే త్వరలో మనదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
టెక్నో మెగాబుక్ టీ1 స్పెసిఫికేషన్లు..
టెక్నో మెగాబుక్ టీ1 ల్యాప్‌టాప్‌లో 15.6 అంగుళాల స్క్రీన్‌ను అందించారు.
టీయూవీ రెయిన్‌ల్యాండ్ ఐ కంఫర్ట్ సర్టిఫికేషన్, అడాప్టివ్ డీసీ డిమ్మింగ్ వంటి ఫీచర్లు కూడా అందించారు.
350 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇది అందించనుంది.
ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌తో ఈ ల్యాప్‌టాప్ లాంచ్ అయింది.
12 జీబీ ర్యామ్, 16 జీబీ ర్యామ్ ఆప్షన్లతో టెక్నో మెగాబుక్ టీ1 మార్కెట్లోకి వచ్చింది.
512 జీబీ ఎస్ఎస్‌డీ, 1 టీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఆప్షన్లు కూడా ఈ ల్యాప్‌టాప్‌లో అందించారు.
విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం కూడా ఇందులో ఉంది.
ముందువైపు వీడియో కాలింగ్ కోసం 2 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
65W ఫాస్ట్ చార్జర్‌ను కూడా దీంతోపాటు అందించారు.
దీని మందం 1.48 సెంటీమీటర్లు కాగా, బరువు 1.48 కేజీలుగా ఉంది.
ఒక హెచ్‌డీఎంఐ పోర్టు, రెండు యూఎస్‌బీ 3.0 పోర్టులు, వైఫై 6, టీఎఫ్ కార్డ్ రీడర్, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి.