రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తా : హరీష్ రావు

-

మెదక్ BRS పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కి హరీష్ రావు సవాల్ విసిరారు. ఈ నెల 25న సీఎం మెదక్ పర్యటనను స్వాగతిస్తున్నాం. ఈ క్రమంలో ఏడుపాయల అమ్మవారి అమ్మవారి దగ్గర ముక్కు నెలకు రాసి ప్రయాశ్చిత్తం చేసుకో అని సూచించారు. రుణమాఫీ చేస్తానని మాట తప్పిన రేవంత్ క్రీస్తు ను క్షమించమని అడుగు అన్నారు.

అయితే ముక్కోటి దేవుళ్ళ మీద ఒట్టేసి సీఎం రేవంత్ మాట తప్పిండ్రు. మెదక్ జిల్లాలో ఏ ఊరుకైనా వెళ్లి రుణ మాఫీ అయిందా అని అడుగుదాం. అక్కడ రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తా.. కాకుంటే నువ్వు రాస్తావా అని సవాల్ విసిరారు. అయినా ఏం ముఖం పెట్టుకొని సిగ్గులేకుండా మెదక్ కు వస్తున్నావ్. మెదక్ జిల్లాలో ఒక్కరోజే ముగ్గురు రైతులు, ఏడాది పాలనలో నాలుగైదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version