ఈరోజుల్లో ఎవరూ కూడా స్మార్ట్ ఫోన్‌ను రెండేళ్ల కంటే ఎక్కువ రోజులు వాడటంలేదు. ఒకవేళ వాడదాం అన్నా.. అవి రెండేళ్ల తర్వాత స్లోగా పనిచేయడం స్టాట్ అవుతాయి..ఈలోపు ఏదో ఒక సేల్ మొదలవుతుంది.. ఎక్సచేంజ్లో కొత్త ఫోన్ తీసుకుంటున్నారు. మీ దగ్గర అంత డబ్బు లేకున్నా ఈఎమ్ఐ ఆప్షన్ కూడా ఉంది. సో..ఇలా ఉన్నటైంలో మన పాత ఫోన్‌ను అమ్మేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. కొత్త ఫోన్ కొనే ఉత్సాహంలో పాత ఫోన్లో డేటాను క్లియర్‌గా చేయకుండా ఇస్తే అంతే సంగతులు. అసలే ఈరోజుల్లో సైబర్ మోసాలు సివయర్గా జరుగుతున్నాయి..
డేటా బ్యాకప్
అన్నింటి కన్నా ముందుగా చేయాల్సి పని మీరు అమ్మేయాలనుకున్న ఫోన్లోని అవసరమైన మొత్తం డేటాను వేరే డివైజ్‌లోకి కానీ, క్లౌడ్‌లోకి కానీ బ్యాక్ అప్ చేసుకోండి. ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఫొటోలు, కాంటాక్ట్ నెంబర్లు, అవసరమైన వాట్సాప్ చాట్స్, కీలకమైన నోట్స్.. ఇలా అన్నీ బ్యాకప్ తీసుకోండి. ఇందులో మీకు గూగుల్ ఎంతో సహకరిస్తుంది. కాంటాక్ట్స్‌ను మీ జీ మెయిల్‌తో సింక్ చేస్తే ఎక్కడికి పోవు.. ఫొటోస్ కోసం గూగుల్ ఫొటోస్ లేదా క్లౌడ్ సేవలు వాడుకోవచ్చు.
ఫోన్ తో లింక్ అయి ఉన్న అకౌంట్స్
మీ ఫోన్‌తో లింక్ అయి ఉన్న అన్ని అకౌంట్స్‌ని ఫోన్లో నుంచి తీసేయండి.. వీటిలో గూగుల్ అకౌంట్, మైక్రోసాఫ్ట్ అకౌంట్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి. వీటిని డిలీట్ చేయండి.
ఫ్యాక్టరీ రీసెట్
డేటా బ్యాకప్‌ను ఒకసారి సరి చూసుకోండి. అంతా సేఫ్‌గా బ్యాకప్ అయిందని నిర్ధారించుకున్న తరువాత, అమ్మేయాలనుకుంటున్న ఫోన్‌ను సెట్టింగ్స్ లోకి వెళ్లి ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. ఇలా ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వల్ల.. ఫోన్లోని ర్యామ్, ఇతర స్టోరేజ్ క్లియర్ అవుతుంది. దాంతో, మీ ఫోన్ కొనుక్కున్న వ్యక్తి వాటిని కొత్తగా వినియోగించుకోవచ్చు.
అలాగే..జీమెయిల్ లాగ్ అవుట్ అవడం కూడా మర్చిపోవద్దు.. కొన్నిసార్లు అన్నీ చేస్తాం కానీ జీమెయిల్ లాగ్ అవుట్ అవకుండా అలానే ఇచ్చేస్తాం.. కొత్త ఫోన్లో మెయిల్ లాగిన్ అవుదామంటే కోడ్ పాత ఫోన్‌కు వెళ్తుంది. ఇలాంటి ఇబ్బందులు పడుకుండా అన్నీ సరిచూసుకుని ఇవ్వండి. ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.