ధరణిలో జరిగిన అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ కి ఆదేశిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల లూటీ పై ఫోరెన్సిక్ ఆడిట్ చేసి నిజాలు నిగ్గు తేల్చుతామన్నారు. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు చేతులు మారాయని ఆరోపించారు.
ధరణి పేరుతో గత ప్రభుత్వం కొల్లగొట్టిన ఆస్తులను పేదలకు పంచుతామని ప్రకటించారు. దొరల స్వార్థం కోసమే ధరణిని తీసుకువచ్చారని మండిపడ్డారు మంత్రి పొంగులేటి. ప్రతిపక్ష నేత కనిపించరు, సభకు రారు, కానీ బిఆర్ఎస్ నేతలు మాత్రం రోజుకో డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పై పుస్తకాలు విసిరారని మండిపడ్డారు.
కేసీఆర్ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా లేరని.. వేట కుక్కలా రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు మంత్రి పొంగులేటి. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేశారని అన్నారు. ఇదంతా ఓ పెద్ద దందా అని అన్నారు. ధరణిలో జరిగిన అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ కి ఆదేశించి.. గత ప్రభుత్వం కొల్లగొట్టిన ఆస్తులను పేదలకు పంచుతామని ప్రకటించారు.