చాలామంది ఫోన్ వేడెక్కిపోవడంతో సఫర్ అవుతూ ఉంటారు. కొంతమంది ఫోన్ మాటిమాటికి వేడెక్కిపోతుంది. వేడెక్కిపోవడం వలన ఎంతగానో ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఫోన్ కూడా తరచూ వేడెక్కి పోతుందా అయితే కచ్చితంగా ఈ విషయాలని మీరు తెలుసుకోవాల్సిందే చాలామంది ఎక్కువగా ఫోన్ ఉపయోగిస్తున్నారు అలాంటప్పుడు ఫోన్ వేడెక్కిపోవడం సహజమే. అయితే ప్రతిరోజు కూడా మీ ఫోన్ వేడెక్కిపోతున్నట్లయితే కచ్చితంగా ఏదో సమస్య ఉందని గుర్తించాలి.
అయితే ఏదో ఒకసారి వేడెక్కితే మాత్రం పెద్ద సమస్య కాదు రోజు వేడెక్కుతుండే మాత్రం కచ్చితంగా ఏదో సమస్య ఉందని గుర్తించాలి. సాధారణంగా బ్యాటరీ తో పాటు ఇతర సమస్యల వలన ఫోన్ వేడెక్కడం సహజం. ఫోన్ రోజు వేడెక్కుతున్నా పట్టించుకోకపోతే కొంతకాలానికి ఫోన్ స్పీడ్ బాగా తగ్గిపోతుంది. ఫోన్ సరిగ్గా పనిచేయడం మానేస్తుంది.
అలాంటప్పుడు మీ ఫోన్ వేడెక్కకుండా కొన్ని చర్యలు తీసుకోవాలి. అయితే ఫోన్ వేడెక్కడానికి పలు కారణాలు ఉన్నాయి ఎక్కువసేపు ఫోన్ వాడడం బ్యాటరీ లేదా చార్జర్ లో సమస్య ఉండడం, మాల్వేల్ కలిగిన యాప్స్ ని ఉపయోగించడం పనిచేయని యాప్స్ ని ఇన్స్టాల్ చేయడం ఇటువంటి కారణాలు ఫోన్ వేడెక్కితే ఫోన్ చార్జింగ్ స్పీడ్ గా తగ్గిపోతుంది.
చార్జింగ్ ఎక్కకుండా ఫోన్ ఆగిపోతూ ఉంటుంది. ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా ఉండదు ఫోన్లో బ్యాటరీ సిమ్ కూడా పనిచేయవు. కెమెరా ఫ్లాష్ లైట్ కూడా పనిచేయదు. డైరెక్ట్ సూర్యకిరణాలు పడకుండా ఫోన్ ని ఉంచితే ఫోన్ వేడెక్కదు. ఫోన్ వంట గదిలో పెట్టకండి. చార్జింగ్ పెట్టి ఫోన్ ని ఉపయోగించడం కూడా మంచిది కాదు. ఎక్కువసేపు అదే పనిగా గేమ్స్ ఆడితే కూడా ఫోన్ వేడెక్కిపోతుంది. చౌక చార్జర్ ని ఉపయోగించడం వలన కూడా ఫోన్ వేడెక్కిపోతుంటుంది.