గ్లోబల్‌గా లాంచ్‌ అయిన Nubia Red Magic 7S Pro గేమింగ్ స్మార్ట్‌ ఫోన్‌..!!

-

ZTE సబ్-బ్రాండ్ అయిన నుబియా నుంచి గేమింగ్‌ స్మార్ట్ ఫోన్‌ గ్లోబల్ మార్కెట్‌లో విడుదలైంది. అదే Nubia Red Magic 7S Pro . లగ్జరీ స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్‌ అయిన ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌, కాస్ట్‌ వివరాలు ఇలా ఉన్నాయి..
మెరుగైన స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌, శక్తివంతమైన చిప్‌సెట్‌ మొదలైన అంశాలు వేగవంతమైన గేమింగ్ అనుభూతిని అందిస్తాయి. ఈ ఫోన్ రెండు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. నిరాంతరాయంగా గేమింగ్ కొనసాగుతున్నప్పుడు ఫోన్ వేడిని చల్లబరిచేందుకు నుబియా స్మార్ట్‌ఫోన్‌లో 10-లేయర్ మల్టీ-డైమెన్షనల్ కూలింగ్ సిస్టమ్‌ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని సూపర్‌నోవా మోడల్‌లో RGB LED లైట్లతో కూడిన అంతర్నిర్మిత మెర్క్యురీ ఫ్యాన్‌తో పాటు అదనంగా ICE 10.0 మల్టీ-డైమెన్షనల్ కూలింగ్ టెక్నాలజీని అందించారు.. ఇంకా రెడ్ కోర్ 1 గేమింగ్ చిప్ కూడా ఉంటుంది.ఫ్రంట్ కెమెరా, 1080×2400 పిక్సెల్‌ల రిజల్యూషన్ కలిగిన ఫుల్ HD+ AMOLED స్క్రీన్‌తో పాటు Nubia Red Magic 7S Pro గ్లోబల్ వెర్షన్‌లో ఉంది
Nubia Red Magic 7S Pro ధర..
12 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర $729. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 59,000గా ఉంది.
18GB RAM + 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన సూపర్‌నోవా వేరియంట్‌ ధర $899 దాదాపు రూ. 72,000 ఉంది.
Nubia Red Magic 7S Pro స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్..
120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.8 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే అందించారు.
12GB/18GB RAM, 256GB/512 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంది.
Qualcomm స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్‌పై నడుస్తుంది.
వెనకవైపు 64MP+ 8MP +2MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు.
ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌ ఉంది.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 65W ఛార్జర్ సపోర్ట్‌ కలిగి ఉంది.
నుబియా రెడ్‌మ్యాజిక్ 7ఎస్ ప్రో విక్రయాలు ఆగస్టు 9 నుంచి ప్రారంభమవుతాయి. నుబియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా విక్రయించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version