ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ( Telegram ) ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో లభించే అనేక ఫీచర్లు వాట్సాప్‌లోనూ అందుబాటులో లేవు. అందుకనే టెలిగ్రామ్ యాప్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన అప్‌డేట్‌లో ఈ యాప్‌లో అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు. అవేమిటంటే..
టెలిగ్రామ్ యాప్‌కు గాను ఐఓఎస్, ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో కొత్త అప్‌డేట్‌ను పొందితే పలు కొత్త ఫీచర్లను యూజర్లు ఉపయోగించుకోవచ్చు. కొత్త అప్‌డేట్‌లో యూజర్లు ఏకంగా 1000 మంది కలిసి గ్రూప్ వీడియో కాల్స్ చేసుకోవచ్చు. 30 మంది తమ కెమెరాలతో వీడియో బ్రాడ్‌కాస్ట్ చేయవచ్చు. అందులో 1000 మంది వరకు పాల్గొనవచ్చు.
ఇక టెలిగ్రామ్ కొత్త అప్‌డేట్‌లో యూజర్లు హై రిజల్యూషన్ కలిగిన వీడియోలను పంపించుకోవచ్చు. 0.5ఎక్స్, 1.5ఎక్స్, 2ఎక్స్ స్పీడ్‌తో వీడియోలను ప్లే చేసుకోవచ్చు. 1-1 కాల్స్ కు స్క్రీన్ షేరింగ్ సదుపాయాన్ని కూడా కొత్త అప్‌డేట్‌లో అందిస్తున్నారు.
కొత్త అప్‌డేట్‌లో యూజర్లు పంపుకునే మెసేజ్ లు 1 నెల తరువాత ఆటోమేటిగ్గా డిలీట్ అయ్యే సదుపాయం కల్పించారు. అలాగే ఫొటోలను ఎడిట్ చేస్తే బ్రష్ సైజ్ తగ్గుతుంది. కొత్తగా టు-స్టెప్ వెరిఫికేషన్‌ను అందిస్తున్నారు. పాస్‌కోడ్ యానిమేషన్స్ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.
టెలిగ్రామ్‌కు చెందిన అప్‌డేటెడ్ వెర్సన్ 7.9ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తే పైన తెలిపిన కొత్త ఫీచర్లు లభిస్తాయి. ఈ అప్‌డేట్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు లభిస్తోంది.