ఇసుక రేణువంత సైజులో కెమెరా.. రీసెర్చర్ల అద్భుత సృష్టికి సలామ్.!

-

ఒకప్పుడు కెమెరాలు అంటే…ఎంతో పెద్దగా ఉండేవి. మారుతున్న టెక్నాలజీలో వస్తువుల సైజ్ కూడా మూరుతూ వస్తుంది. ఇంతకు ముందు కంప్యూటర్లు ఎంత పెద్దగా ఉండేవి..ఒక రూం అంతా వాటికే పట్టేది..కానీ ఇప్పుడు చిన్నగా వచ్చేశాయి. కంప్యూటర్లు నుంచి టాబ్ ల వరకూ వచ్చేశాం. అలాగే కెమెరాల్లో కూడా చిన్న కెమెరాలు వచ్చాయి. పెన్ కెమెరా, బటన్ కెమెరా అంటూ చిన్నవే ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబేయోది అంత కంటే చిన్న కెమెరా గురించి. ఇసుక రెణువు ఎంత సైజులో ఉంటుందో తెలుసుకదా అంత సైజులో కమెరాను తయారు చేశారు.. అమెరికా సైంటిస్టులు. అదేంటో మనకూ చూద్దాం.

అత్యంత చిన్నదైన మైక్రో కెమెరాను క్రియేట్ చేశారు అమెరికా సైంటిస్టులు. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన పరిశోధకులు కలిసి ఈ చిన్నపాటి కెమెరాను రూపొందించారు. దీంతో 5లక్షల రెట్లు పెద్ద లెన్స్‌తో కెమెరా లాంటి ఫొటోలను తీయొచ్చట. అర మిల్లీమీటర్ వెడల్పు ఉండే ఈ కెమెరాను ‘మెటాసర్‌ఫేస్’ అనే టెక్నాలజీతో రీసెర్చర్లు డెవలప్ చేశారు. సుమారు 16 లక్షల సిలిండ్రికల్ పోస్టులను కూర్చడం ద్వారా ఈ మైక్రో కెమెరాను తయారుచేశారట.

కంప్యూటర్ చిప్‌లను క్రియేట్ చేసినట్లే…ఈ కెమెరాను భారీగా డెవలప్ చేయవచ్చునని రీసెర్చర్లు తెలియజేశారు. గతంలో రూపొందించిన మెటాసర్‌ఫేస్‌ కెమెరాలను రూపొందించారు..వాటితో పోలిస్తే ఇప్పుడు క్రియేట్ చేసిన మైక్రో కెమెరా అనేక రెట్లు క్లారిటీ రెజిల్యుషన్ ఫొటోలను తీస్తుందట. ఫొటోల్లో వస్తువుల కార్నర్స్ కొంచెం బ్లర్‌ అవుతున్నాయి. కానీ, చూడటానికి మాత్రం సాధారణ కెమెరాతో తీసిన ఫొటోలానే మాదిరిగానే ఉన్నాయి. పెద్ద కెమెరా కంటే 5 లక్షల రెట్లు పెద్దవైన వస్తువులను కూడా ఈ మైక్రో కెమెరా సులభంగా ఫొటోలను తీయగలదని పరిశోధకులు అంటున్నారు.

ఈ కెమెరానుతయారుచేయటంలో ముఖ్య ఉద్దేశం.. వైద్యరంగంలో వినియోగించడం. తద్వారా అనేక అద్భుతాలు చేయవచ్చునని పరిశోధకులు అంటున్నారు. ఈ మైక్రో కెమెరాలో ఉపయోగించిన ప్రతి ఒక్కటి హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ కణాల పరిమాణంలోనే ఉంటుంది పరిశోధకులు వెల్లడించారు.. ప్రతిది ఆప్టికల్ యాంటెన్నాగా పనిచేస్తుంది. ఖచ్చితమైన డిజైన్‌తో రూపొందించారు. సిగ్నల్ ప్రాసెస్ అల్గోరిథం ద్వారా ప్రాసెస్ చేశారు.. దీని మొత్తం సెటప్‌ను న్యూరల్ నానో-ఆప్టిక్స్‌గా పిలుస్తారట.సో అలా ఈ కెమెరాను పరిశోధకులు రూపొదించారు. చూడ్డానికే భలే గమ్మత్తుగా ఉంది కదూ ఈ కెమెరా..!

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version