ఆ ఫోన్ లో డేటా పోతుంది… జాగ్రత్త…!

-

డేటా భద్రత విషయంలో మొబైల్ కంపెనీలు ఎన్ని ప్రమాణాలు పాటించినా సరే భద్రత అనేది అసాధ్యంగా మారింది ఈ రోజుల్లో… వెబ్ సైట్స్ నుంచి మొబైల్ ఫోన్ వరకు డేటా చోరి జరుగుతుంది. వ్యక్తిగత భద్రతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ డేటా చూసి వ్యవహారం దెబ్బకు వినియోగదారులు తమ ఫోన్ లేదా వెబ్ సైట్ లో డేటా దాచుకోవాలి అంటేనే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ప్రముఖ మొబైల్ తయారి సంస్థ వన్ ప్లస్ ఒక కీలక ప్రకటన చేసింది. తమ అధికారిక వెబ్ సైట్ లో ఒక కథనాన్ని ప్రచురించింది.. డేటా చోరీ జరిగిందని వెల్లడించింది.  

ఇది చాలా మంది వినియోగదారులపై ప్రభావం చూపించిందని సంస్థ వెల్లడించింది. అనధికార పార్టీ యాక్సెస్ చేసిన సమాచారంలో వినియోగదారుల పేరు, సంప్రదింపు సంఖ్య, ఇమెయిల్ మరియు షిప్పింగ్ చిరునామా ఉన్నాయని… చెప్పిన సంస్థ అయితే, చెల్లింపు సమాచారం, పాస్‌వర్డ్‌లు మరియు ఖాతా వివరాలు వంటి క్లిష్టమైన సమాచారం సురక్షితమని వన్‌ప్లస్ పేర్కొంది. దీనిపై సంస్థ ఇప్పటికే అధికారులతో కలిసి దర్యాప్తు కూడా మొదలుపెట్టినట్టు సమాచారం. అయితే ఇక నుంచి మీ ఫోన్ పై దాడి జరిగితే వెంటనే మీకు ఈమెయిల్ వస్తుందని,

తద్వారా మీరు జాగ్రత్త పడవచ్చని సంస్థ పేర్కొంది. డేటా ఉల్లంఘన వన్‌ప్లస్ వెబ్‌సైట్‌లో జరిగింది మరియు ఎంపిక చేసిన వన్‌ప్లస్ కస్టమర్లను ప్రభావితం చేసింది. అందువల్ల, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ మరియు టీవీ వినియోగదారులందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ పేర్కొంది. ప్రభావిత వినియోగదారుల డేటాలో చెల్లింపు వివరాలు మరియు పాస్‌వర్డ్‌లు వంటి క్లిష్టమైన సమాచారం ఉండదని వన్‌ప్లస్ హామీ ఇచ్చింది. ఎప్పటికప్పుడు ఇమెయిల్ ని చెక్ చేసుకోమని సంస్థ సూచిస్తుంది. గత ఏడాది కూడా ఇదే తరహాలో వన్ ప్లస్ లో డేటా చోరీ జరిగింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version