అల్లు అరవింద్, దిల్ రాజుల‌కు స‌వాల్ విసిరిన ముర‌ళీ మోహ‌న్‌..!

-

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్య‌క్ర‌మం రోజు రోజుకు విస్త‌రిస్తోంది. ఇక తాజాగా సినీనటి జయసుధ విసిరిన గ్రీన్ చాలెంజ్ సినీనటుడు మురళీ మోహన్ స్వీకరించారు. హైదరాబాద్ లోని తన నివాస ప్రాంగణంలో కాదంబరి కిరణ్ తో కలిసి మూడు మొక్కలు నాటారు. నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, కేల్ నారాయణ తదితరులకు మురళీ మోహన్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. మరోవైపు గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా నటుడు కోట శ్రీనివాస రావు తన నివాసంలో మొక్కలు నాటారు.

రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ నిర్వహించిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా తెలంగాణ పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ దామోదర్ విసిరిన ఛాలెంజ్‌ను జయసుధ స్వీకరించారు. ఫెయిర్ ఫీల్డ్ కాలనీలో మొక్కలు నాటారు. తర్వాత సినీనటులు మోహన్ బాబు, మురళీ మోహన్, యాంకర్ సుమకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version