మొబైల్స్ తయారీదారు ఒప్పో ఎఫ్9 సిరీస్ లో రెండు నూతన స్మార్ట్ ఫోన్లను భారత్‌లో సోమవారం విడుదల చేసింది. ఒప్పో ఎఫ్19 ప్రొ, ఎఫ్19 ప్రొ ప్లస్ 5జి పేరిట ఆ ఫోన్లు విడుదలయ్యాయి. వీటిల్లో 5.6 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లేను కామన్‌గా అందిస్తున్నారు. అలాగే 180 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఎఫ్19 ప్రొ ఫోన్లో మీడియాటెక్ హీలియో పి95 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ప్రొ ప్లస్ 5జిలో మీడియాటెక్ డైమెన్సిటీ 800యు ప్రాసెసర్‌ను అమర్చారు. అందువల్ల ఇందులో 5జికి సపోర్ట్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ వీటిల్లో లభిస్తుంది.
ఈ ఫోన్లలో వెనుక వైపు 48 మెగాపిక్సల్ కెమెరాకు తోడు మరో 8 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సల్ మోనో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు ఫోన్లలో 4310 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. 50 వాట్ల ఫ్లాష్ చార్జింగ్ ఫీచర్ ను ఇచ్చారు. అయితే ఎఫ్19 ప్రొ ప్లస్ 5జి ఫోన్ కు 65 వాట్ల చార్జర్ వస్తుంది. ఎఫ్19 ఫోన్‌కు 30 వాట్ల చార్జర్ ను ఇస్తారు.
ఒప్పో ఎఫ్19 ప్రొ, ప్రొ ప్లస్ 5జి ఫీచర్లు…
* 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, 2400 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఎఫ్ 19 ప్రొ ప్లస్ 5జి – మీడియాటెక్ డైమెన్సిటీ 800యు ప్రాసెసర్
* ఎఫ్19 ప్రొ – మీడియాటెక్ హీలియో పి95 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్
* 128/256 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్
* ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 48, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్సల్ సెల్పీ కెమెరా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
* డ్యుయల్ 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్ సి
* 4310 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
ఒప్పో ఎఫ్19 ప్రొ, ఎఫ్19 ప్రొ ప్లస్ 5జి ఫోన్లు ఫ్లుయిడ్ బ్లాక్, స్పేస్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లాంచ్ అయ్యాయి. ఎఫ్19 ప్రొ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధఱ రూ.21,490 ఉండగా ఈ ఫోన్ మార్చి 17 నుంచి లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.23,490 ఉండగా ఈ ఫోన్‌ను మార్చి 25 నుంచి విక్రయిస్తారు. అలాగే ఒప్పో ఎఫ్19 ప్రొ ప్లస్ 5జి ఫోన్ ధర రూ.25,990గా ఉంది. దీన్ని మార్చి 17 నుంచి విక్రయిస్తారు.