2020లో వచ్చేది ఎస్‌11 కాదు.. ఎస్‌20

-

సామ్‌సంగ్‌ మొబైల్స్‌ 2020లో విడుదల చేయబోయే ఎస్‌ సిరీస్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లను ఎస్‌20 గా వ్యవహరించనున్నది, 2020 సంవత్సరానికి గుర్తుగా ఇలా బ్రాండ్‌ పేరు మార్చింది.

ప్రసిద్ధ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ, సామ్‌సంగ్‌, తన 2020 ఫ్లాగ్‌షిప్‌ అయిన ఎస్‌సిరీస్‌ ఫోన్లను ఫ్రిబ్రవరి 2020లో విడుదల చేయనుంది. మామూలుగా అయితే ఈ ఏడాది రావాల్సిన సిరీస్‌ ఎస్‌ 11. కానీ, దానికి భిన్నంగా ‘ఎస్‌20’ ని విడుదల చేయబోతోందని తెలిసింది. ఇయర్‌ 2020కి గౌరవంగా ఈవిధంగా పేరు మార్చనున్నారు.

కొత్తగా రాబోయే ఈ సిరీస్‌లో ఎస్‌20, ఎస్‌20+, ఎస్‌ 20 అల్ట్రా అనే మూడు రకాల ఫోన్లు ఉంటాయి. ఇవి 6.2, 6.7, 6.9 అంగుళాల పరిమాణంలో ఉంటాయని ప్రముఖ టిప్‌స్టర్ తెలిపారు. ఎస్‌20లో మూడు కెమెరాల సెటప్‌ ఉంటుంది. ఒకటి వైడ్‌యాంగిల్‌ కాగా, మరో రెండు 5ఎక్స్‌ జూమర్‌, 108 పిక్సెల్‌ మెయిన్‌ కెమెరా. షరామామూలుగానే అమెరికాలో క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌, మిగతా అన్ని ప్రాంతాల్లో స్వంత ఎక్సినోస్‌ 990తో విడుదలవుతుంది. 8జిబి ర్యామ్‌, 128 జిబి మెమొరీ (ఇంకా పెంచుకోవచ్చు), 4000ఎంఎహెచ్‌ బ్యాటరీ దీని ప్రమాణాలు.

ఇక ఎస్‌20+ విషయానికొస్తే, ఎస్‌20లో ఉన్న అన్ని సౌలభ్యాలు ఉంటూ, కొత్తగా నాలుగు కెమెరాల సెటప్‌ ఉంటుంది. ఎస్‌20లో ఉన్న మూడు కెమెరాలు యధావిధిగా ఉంటూ, నాలుగవ కెమెరాగా టైమ్‌ ఆఫ్‌ ఫ్లయిట్‌ సెన్సర్‌ స్నాపర్‌ ఉంటుంది. ఇది ఏఆర్‌, పోర్ట్రయిట్‌ ఫోటోలకు బాగా పనికొస్తుంది. 12జిబి ర్యామ్‌, 256జిబి మెమొరీ, 4500 బ్యాటరీ మిగిలిన ప్రత్యేకతలు.

అన్నింటికంటే ప్రత్యేకమైనది, ఫీచర్లపరంగా అత్యుత్తమమైనది, ఎంతో ఖరీదైనది అయిన ప్రధాన ఫోన్‌ ఎస్‌ 20 అల్ట్రా. ఇది అతిపెద్ద తెర 6.9 అంగుళాల పరిమాణంలో కలిగిఉంటుంది. ప్రత్యేకతలలో పై రెండు మోడళ్లలో ఉన్న అన్నింటినీ కలిగిఉండి, 5వ కెమెరాగా 2ఎక్స్‌ టెలీఫోటో కెమెరా ఉంటుందివ. బ్యాటరీ 5000ఎంఏహెచ్‌.

పై మూడు ఫోన్లు రాబోయే 5వ తరం నెట్‌వర్క్‌ సౌలభ్యం (5జి)తో తప్పకుండా ఉంటాయి. భారత్‌లో 2020లో 5జి సౌలభ్యం లభించే అవకాశాలు దాదాపుగా లేనప్పటికీ, ఫోన్లలో మాత్రం ఆ ఫీచర్‌ ఉంటుంది. అన్ని ఫోన్లు ఆండ్రాయిడ్‌ 10తో, వన్‌ యూఐ 2.1 ఇంటర్‌ఫేస్‌ సాఫ్ట్‌వేర్‌తో వస్తాయి. 45వాట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌, రివర్స్‌ చార్జింగ్‌ ప్రత్యేకతలు కూడా ఉంటాయి.

ప్రతి ఏడాది మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ కంటే ముందుగానే సామ్‌సంగ్‌ తన అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ను జరుపుతుంది. అందులోనే ఎస్‌ సిరీస్‌ ఫోన్లను ప్రకటిస్తారు. ఈసారి కూడా ఫిబ్రవరి 11న ఈవెంట్‌ జరపనుంది. అదేరోజు ఈ ఎస్‌20 సిరీస్‌ ఫోన్లను అధికారికంగా విడుదల చేస్తారు. మార్కెట్లోకి మాత్రం ఫిబ్రవరి 20 తర్వాత వచ్చే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version