వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌.. ఇక ఆ సమస్య ఉండదు!

-

మెసేంజర్‌ యాప్‌ వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే అర్కైవ్‌ ఆప్షన్‌
.. దీని వల్ల ఏం ఉపయోగం.. ఎలా వాడాలో ఆ వివరాలు తెలుసుకుందాం. ఈ కొత్త ఫీచర్‌తో మీ చాట్‌ లిస్ట్‌లో కనిపించకూడదు అని మీరు అనుకునే అర్కైవ్డ్‌ నంబర్లు, గ్రూప్‌లను వినియోగదారులు పక్కన పెట్టవచ్చు. ఇదివరకు అర్కైవ్‌ ఫీచన్‌ను ఎంచుకున్నా.. మళ్లీ ఆ వ్యక్తి లేదా గ్రూప్‌ సభ్యులు మెసేజ్‌ చేసినప్పుడు తిరిగి చాట్‌ లిస్ట్‌లో కనిపించేది. అయితే ఇప్పుడు అలా జరగదు.

చాలా రోజుల కిందట జాయిన్‌ అయిన గ్రూపుల్లో మీరంతట మీరు ఎగ్జిట్‌ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గ్రూపు సభ్యులు ఏమనుకుంటారో అని అనుకుంటాం. మనం ఆ గ్రూపుపై అంత ఆసక్తి చూపకున్నా.. పిచ్చిపిచ్చి మెసేజ్‌లు, వీడియోలు మన ఫోన్లో డంప్‌ అయిపోతూ ఉంటాయి. ఇది మనకు చిరాగ్గా అనిపించవచ్చు. ఇక అటువంటి వ్యక్తి లేదా గ్రూప్‌ నుంచి కొత్త మెసేజ్‌ వచ్చినా, అది చాట్‌ లిస్ట్‌లో కనిపించదు. మళ్లీ మనం సెట్టింగ్స్‌ మార్చుకుంటే తప్ప. దీనికి మీ వాట్సాప్‌ను అప్‌డేట్‌ను చేయాల్సి ఉంటుంది. మీ వాట్సాప్‌ అకౌంట్‌లో ఏదైనా కాంటాక్ట్, గ్రూప్‌ను అర్కైవ్‌ చేసి చూస్తే, కొత్త ఫీచర్‌ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఆటోమేటిక్‌ అన్‌ అర్కైవ్‌ ఆపేయాలన్నా సులభమే. దీనికి మొదట వాట్సాప్‌ యాప్‌లోని సెట్టింగ్స్‌లోని చాట్స్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే ‘అర్కైవ్‌డ్‌ చాట్స్‌’ అని ఉంటుంది. డీఫాల్ట్‌గా ఈ ఆప్షన్‌ ఎనేబుల్‌లో ఉంటుంది. అర్కైవ్‌ చేసిన గ్రూపు, వ్యక్తి మెసేజ్‌లను హోం స్క్రీన్‌ టాప్‌లో ‘అర్కైవ్‌డ్‌’ అనే సెక్షన్‌లో కనిపిస్తుంది. మనకు కావాల్సినపుడు దాన్ని ఎంచుకుని మెసేజ్‌లు చూసుకోవచ్చు. అక్కర లేనప్పుడు అన్‌అర్కైవ్‌ చేసుకోవచ్చు. ఇక మీరు అర్కైవ్‌ చేసిన విషయం సదరు వ్యక్తికి లేదా గ్రూపు సభ్యులకు తెలియదు కూడా. ఇక సందేహం లేకుండా మీకు నచ్చని గ్రూపుని అర్కైవ్‌ చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version