యూజ‌ర్ల‌కు వాట్సాప్ షాక్‌.. మెసేజ్ ఫార్వార్డింగ్ పై నిబంధ‌న‌లు మ‌రింత క‌ఠిన‌త‌రం..!

-

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త‌న యూజ‌ర్ల‌కు షాక్ ఇచ్చింది. ఇక‌పై అందులో మెసేజ్‌ల‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ఫార్వార్డ్ చేయ‌డం అంత ఈజీ కాదు. ప‌లు ర‌కాల మెసేజ్‌ల‌ను కేవ‌లం ఒక్క‌రికి మాత్ర‌మే ఫార్వార్డ్ చేసుకునేలా వాట్సాప్ నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేసింది. దీంతో ఎక్కువ‌గా ఫార్వార్డ్ అయ్యే మెసేజ్‌లకు ఈ నిబంధ‌న వ‌ర్తించ‌నుంది. వాటిని యూజ‌ర్లు ఒక్క‌సారి కేవ‌లం ఒక్క‌రికే ఫార్వార్డ్ చేసుకునేందుకు వీలుంటుంది.

ప్ర‌స్తుతం క‌రోనా వైరస్ నేప‌థ్యంలో ఫేక్ వార్త‌ల‌ను కొంద‌రు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ప్ర‌చారం చేస్తున్నారు. వాట్సాప్‌లో అయితే ఇలాంటి మెసేజ్‌లు నిత్యం కోకొల్ల‌లుగా వ‌స్తున్నాయి. దీంతో జ‌నాలు త‌ప్పుదోవ ప‌డుతున్నారు. అందుక‌ని.. ఇలాంటి న‌కిలీ వార్త‌ల ప్ర‌చారాన్ని అడ్డుకోవ‌డానికే పైన తెలిపిన నిబంధ‌న‌ను అమ‌లులోకి తెచ్చామ‌ని వాట్సాప్ తెలిపింది. ఇక గ‌తంలో ఒక్క మెసేజ్‌ను కేవ‌లం 5 మందికి మాత్ర‌మే ఫార్వార్డ్ చేసుకునేలా వాట్సాప్ నిబంధ‌న విధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు దాన్ని ఒక్క‌రికి కుదించింది.

కాగా క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో యూజ‌ర్ల‌కు వ‌చ్చే వార్త‌ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌కూడ‌ద‌ని, అవి నిజ‌మే అని నిర్దారించుకోవాల్సిన బాధ్య‌త యూజ‌ర్ల‌పై ఉంద‌ని వాట్సాప్ తెలియ‌జేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version