గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో వసుధార రిషీలాగా క్లాస్ చెప్తూ ఉంటుంది. రిషీ అంతా డోర్ దగ్గర ఉండి చూస్తూనే ఉంటాడు. పుష్పా ఎలాగోలా చెప్పాలని ట్రై చేస్తే..వసూ బోర్డుపై రాస్తూ.. ఎవరది..గొంతుబాలేదా, అల్లరిచేస్తే గోడకుర్చి వేయిస్తా అంటుంది. రిషీ కూడా గొంతుతో హు హూ అంటే..అరే ఎవరది..ఎందుకు సౌండ్ చేస్తున్నారు అని..అలా సడన్గా రిషీని చూస్తుంది. వసూకి దిమ్మతిరిగిపోతుంది. రిషీని సారీ సార్..పనిష్మేంట్ ఏంటి సార్ అంటుంది. వెళ్లి కుర్చోమంటాడు రిషీ. నేను లేటుగా వస్తే నువ్వే క్లాస్ తీసుకుంటావా అంటే..క్లాస్ లోంచి బయటకు వెళ్లాలా సార్ అంటుంది వసూ..నేను చెప్పానా..ఇంకా టైం ఉంది కదా..ఇంకొక లెక్క చెప్పు, నేను వెళ్లిపోతాను అని చెప్పే క్లాస్ లోంచి రిషీ వెళ్లిపోతాడు.
రిషీకి శిరీష్ ని చూడగానే కోపం వస్తుంది. మహేంద్ర అంటే రిషీ..శిరీష్ నీతో ఏదో మాట్లాడాలంటే తీసుకొచ్చాను అంటాడు. చిన్నహెల్ప్ కావాలి సార్ అంటాడు శిరీష్. ఇద్దరూ కుర్చుంటారు. మహేంద్ర మనసులో నాన్నా రిషీ ఇప్పుడైనా నీ మనసులో మాట బయటపెట్టరా అనుకుంటాడు. శిరీష్ ని అడగండి ఆఫీసర్ అంటాడు. శిరీష్ అనుకోని పరిస్థితుల్లో మా పెళ్లి అని నిర్ణయం తీసుకున్నాం అమ్మూ అని పేరు చెప్పబోతే..మహేంద్ర ఆగండి ఆఫీసర్..పాయింట్ కి రండి. మీ ఇద్దరికి ఎంగేజ్ మెంట్ అయిపోయింది. ఇప్పుడేంటి అది అడగండి అంటాడు. శిరీష్ అనుకోని పరిస్థితుల్లో నాకు ఎంగేజ్ మెంట్ అయింది, నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది, పెళ్లిచేసుకోని వెళ్లిపోవాలి, మీరు పర్మిషన్ ఇస్తే వసుధారను తీసుకెళ్తాను, పెళ్లిపనులు అంటూ చెప్పబోతాడు. మహేంద్ర ఇప్పుడేంటి ఆఫీసర్ వసుధారను తీసుకేళ్లాలి అంతేకదా అంటాడు. రిషీ ఆ వసుధార లేకుండా పెళ్లి ఎలా అవుతుంది అంటాడు. మహేంద్ర ఇదే ఛాన్స్ అనుకుని..రిషీకి కోపం వచ్చేలా మట్లాడతాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు, వసుధార ఏది అడిగినా రిషీ ఎలా కాదంటాడు అంటాడు. రిషీ లేచి వసుధార నేను లెక్చర్ అవుతాను అన్న మాటలను తలుచుకుని ఆ మాటలు ఏమయ్యాయి అనుకుని అటెండర్ తో వసుధారను రమ్మంటాడు. మహేంద్ర మనసులో ఇప్పుడు అగ్నిపర్వతం బద్దలవుతుంది. వసూపై ప్రేమను ఇకనైనా చూపిస్తాడు అనుకుంటాడు. రిషీ శిరీష్ గారు మీరు వెళ్లండి అంటాడు. మహేంద్ర మీరు వెళ్లండి శిరీష్..ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు అంటాడు. మళ్లీ రిషీ అవసరంలేదు ఉండండి అంటాడు.
ఇంతలో వసూ వస్తుంద. రమ్మన్నారంట సార్ అంటుంది. శిరీష్ ని చూసి శిరీష్ నువ్వేంటి ఇక్కడ, ప్రయాణం పెట్టుకుని ఇక్కడికి వచ్చావ్ అంటుంది. శిరీష్ చెప్పబోతే..నేను చెప్తాను శిరీష్ గారు అని రిషీ..పెళ్లికదా నువ్వెళ్లాలి కదా, పంపడానికి పర్మిషన్ అడగటానికి వచ్చారు, పర్మిషన్ ఇస్తున్నాను వెళ్లు అంటాడు. వసూ శిరీష్ తో నేకేమైనా బుద్దిఉందా, ఒకమాట చెప్పిరావాలికదా అని తిడుతుంది..రిషీ.చెప్పివచ్చినా చెప్పకుండా వచ్చినా పెద్దతేడా ఏంటంటా..నువ్వు లేకుండా తన పెళ్లిపనులు, పెళ్లి ఎలా జరుగుతుంది అంటాడు. మహేంద్ర మనసులో వీడు మారడు అనుకుంటాడు. వసూ శిరీష్ నువ్వునాతో రా అని చేయి పట్టుకుని లాక్కెళుతుంది. రిషీకి అదంతా చూసి కోపం వస్తుంది.
బయట వసూ శిరీష్ పై అరిచేది అంతా రిషీ క్యాబిన్ లో ఉండి చూస్తాడు. మహేంద్ర రిషీతో పర్మిషన్ ఎందుకు ఇచ్చావ్ అంటాడు. ఇవ్వాలనిపించింది అంటాడు రిషీ. ఒకమాట చెప్పనా రిషీ అంటాడు. వద్దంటే ఆగుతారా చెప్పండి అంటాడు. ఇది సందర్భం అవునో కాదో నాకు తెలియదు, మనసులో ఏది ఉంచుకోకూడదు, బయటకు చెప్పాలి అంటాడు. అన్ని చెప్పటం అన్ని వేళలా కరెక్టుకాదు అని చెప్పేసి రిషీ బయటకు వెళ్తాడు.
కారు దగ్గర నిలబడి శిరీష్ అన్నమాటలను తలుచుకుంటాడు. అప్పుడే శిరీష్, వసూ మాట్లాడుకునేది రిషీ దూరం నుంచి చూస్తాడు. వసూ శిరీష్ కారు ఎక్కేసి వెళ్లిపోతుంది. రిషీ చూసి శిరీష్ వెంట వెళ్తుందా అనుకుని వెళ్లిపోతాడు. వసూ రెస్టారెంట్ లో సర్వ్ చేస్తూ..రిషీ సార్ రాలేదేంటి, ఏం జరిగినా ఇక్కడికి వచ్చి అరవడమో, అలగడమో చేస్తారు కదా అనుకుంటుంది. రిషీ రెస్టారెంట్ బయటే ఉండి..వసూధార ఇక్కడికి వచ్చిందా, అయినా నేనే పర్మిషన్ ఇచ్చాను కదా, ఊరువెళ్లి ఉంటుంది. చదువుకుంటాను, అదవుతాను ఇది అవుతాను అనింది కదా పెళ్లిపనులంటా పెళ్లిపనులు..ఫోన్ చేసి ఊరివెళ్లిందా, రెస్టారెంట్ కి వచ్చిందా కనుక్కుంటే అనుకుని..వద్దు పొగరుకి ఇంకా పొగరు ఎక్కువవుతుంది అని కాల్ చేయడు. వసూ బయటకు వచ్చి రిషీకి కాల్ చేస్తుంది. ఏంటి సార్ రాలేదు అంటుంది. ఎక్కడికి అని రిషీ అంటే..రెస్టారెంట్ కి అంటుంది వసూ. అయినా నువ్వు ఊరు వెళ్తా అన్నావ్, పెళ్లి పనులు ఉన్నాయని శిరీష్ అన్నాడుకదా అంటే..వాటికి ఇంకా చాలా టైం ఉంది సార్ అంటుంది వసూ. అలాంటప్పుడు పర్మిషన్ అడగటం ఎందుకో అంటే. శిరీష్ అంతే సార్..సడన్గా వచ్చాడు, మనుసులో మాట చెప్పాడు, ఎంగేజ్ మెంట్ అన్నాడు, పెళ్లిఅన్నాడు అంతా ఫన్ కదా సార్ అంటుంది వసూ. అవునవును పెద్ద ఫన్ అంటాడు రిషీ..మీరెక్కడ ఉన్నారు సార్ అని వసూ అడిగితే..ఎందుకు అంటాడు రిషీ..నాకెందుకో మీరు మా రెస్టారెంట్ దగ్గరే ఉన్నట్లు అనిపిస్తుంది అని వసూ ముందుకు నడుస్తుంది. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
-triveni