గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో జగతి వసూ ఇంకా ఇంటికి రాలేదని ఆలోచిస్తూ వసూకి కాల్ చేస్తుంది. వసూ ఆటోకోసం వెయిట్ చేస్తున్నా వచ్చేస్తున్నా అంటుంది. వసూ రోడ్డుమీద ఆటోకోసం చూస్తూఉండగా ఓ కారు వచ్చి ఎవరో ఒక ముసలిఆయనను ఢీ కొట్టేసి వెళ్తుంది. అది వసూ చూసి పరుగెత్తుకుంటూ వెళ్లి చూస్తుంది. వెళ్లేపోయే కారులను ఆపుతుంది. ఎవడూ ఆపడు. ఫైనల్ గా ఒక టాక్సీ ఆపుతారు. అందులోంచి ఒక అబ్బాయిదిగుతాడు. వసూ మ్యాటర్ చెప్తుంది. ఆ పెద్దాయనను కారులో ఎక్కిస్తారు. వసూ పక్కన పర్స్ ఉంటే..ఆ అబ్బాయి అది నాదేనండి ఉంచండి మళ్లీ తీసుకుంటాను అనటంతో..వసూ అది బ్యాగ్ లో వేసుకుంటుంది.
ఇక్కడ వసూ వాళ్లు ఆసుపత్రికి వస్తారు. ఆయన్ని లోపలకి తీసుకువెళ్తారు. పేషెంట్ డీటెల్స్ రాసి సైన్ చేయమని నర్స్ అంటే..ఆయన ఎవరో నాకు తెలియదు వీరి బాభ్బై అంటాడు. ఆయన నా బాబ్భై కాదు..మా నాన్న తమ్ముడి వయసు ఉంది కాబట్టి అలా అన్నాను, సాటి మనిషి కాబట్టి అలా బాధపడ్డాను అని డీటెల్స్ రాసి ఇస్తుంది. ఇక ఆ అబ్బాయి పొగడటం స్టాట్ చేస్తాడు. మీరు నిజంగా గ్రేట్ అండి, సాటి మనిషి కోసం ఇంతలా చేస్తున్నారంటే గ్రేట్ అని నా పేరు గౌతమ్ అంటాడు. వసూ నమస్కారం అంటుంది. డ్రైవర్ వెళ్దామా అంటే..వాడు ఉండండి..వెయిటింగ్ ఛార్జెస్ ఇస్తాను అంటాడు. వసూ పేషెంట్ సేఫ్ అని తెలుసుకుని వెళ్తే సాటిఫ్యాక్షన్ ఉంటుంది కదండి..అంటుంది.
జగతి వసూ ఇంకా రాలేదేంటి అని కాల్ చేస్తుంది. వసూ వస్తున్నాను మేడమ్ అంటుంది. నర్స్ వచ్చి పేషెంట్ సేఫ్ గానే ఉన్నాడండి అని చెబుతుంది. వసూ బ్యాగ్ లో పర్స్ ఇచ్చేస్తుంది. ఆ అబ్బాయి ఇంకా మాట్లాడపోతే..వసూ బాయ్ చెప్పేసి వెళ్తుంది. గౌతమ్ నా పేరు చెప్పినప్పుడు తన పేరు కూడా చెప్పొచ్చుకదా ఏంటో అనుకుంటాడు. వసూ ముందుకెళ్లి బాయ్ చెప్పి స్మైల్ ఇస్తుంది. అంతే మనోడు ఫ్లాట్ అయిపోతాడు. అబ్బా నవ్వా అది, పూలవర్షం కురిసినట్లు ఉంది, అందం మాటతీరు, కల్చర్ దేవకన్యలా ఉంది అనుకుంటాడు.
తరువాయిభాగంలో ఉంది అసలైన ట్విస్ట్. ఆ గౌతమ్ రిషీకి ఫ్రెండ్, నేరుగా రిషీ క్యాబిన్ కి వచ్చి ఒక అమ్మాయిని చూశారా, ఏముంది రా అంటూ వసూ గురించి చెప్తాడు. ఆ అమ్మాయి ఎవరో ఏంటో కనుక్కోవాలిరా అని అంటే..నీకు రాశిపెట్టి ఉంటే మళ్లీ కనిపిస్తుంది అంటాడు రిషీ. ఇంకోసీన్ లో రిషీ, గౌతమ్ కారులో వెళ్తుండగా..వసూ రోడ్డుమీద నడుచుకుంటూ వస్తుంది. అది చూసి.. గౌతమ్ కారు ఆపురా, ఆ అమ్మాయి కనిపించింది అని వెళ్లి వసూని కలుస్తాడు. రిషీ వీడు చెప్తింది వసుధార గురించా అనుకుంటాడు. ఇక రిషీకి నిప్ఫులకుంపటి మళ్లీ స్టాట్ అయినట్లే.