టీఆర్ఎస్ మీద కడుపు మంటలతోనే అక్రమ పొత్తుతో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టారన్నారని విమర్శించారు మంత్రి గంగుల కమలాకర్. కేసీఆర్ బలపర్చిన బానుప్రసాద్ ఎల్ రమణలకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా కేసీఆర్ బలం, బలగం చూపించామని, క్రమశిక్షణ చూపించామని ఆయన అన్నారు. బండి సంజయ్ అభ్యర్థిని పెట్టలేమని చెబితే.. ఈటెల రాజేందర్ అభ్యర్థిని పెడదామన్నారని దుయ్యబట్టారు. బీజేపీ, కాంగ్రెస్ 86 ఓట్లు టీాఆర్ఎస్ పార్టీకి క్రాస్ అయ్యాయని గంగుల అన్నారు. అపవిత్ర పొత్తుతో ఉన్న అభ్యర్థికి ఎవ్వరూ మద్దతు ఇవ్వలేదని ఆయన అన్నారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కలిసిన చరిత్ర కరీంనగర్ లో నెలకొన్నదని గంగుల అన్నారు. తెలంగాణ గడ్డపై ఓటు అడిగే హక్కు ఒక్క టీఆర్ఎస్ పార్టీకే ఉందని ఆయన అన్నారు. కరీంనగర్ లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిపించిన పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.
మూడో సారి అవకాశం ఇచ్చిన కెసిఆర్ కు,కేటీఆర్ కు ఎమ్మెల్సీ భాను ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. రెండు స్థానాలు మెదటి ప్రాధాన్యత ఓట్లతో గెలవడం ఆనందం కలిగిందనన్నారు. ఈ గెలుపు టి ఆర్ యస్ పార్టీ సమిష్టి విజయం అని అన్నారు. నాకు అవకాశం ఇచ్చిన కేసీఆర్ సారథ్యంలో నిరంతరం నిబద్ధతతో పనిచేస్తానని ఎల్ రమణ అన్నారు.