5 జనవరి 2019 శనివారం మీ రాశి ఫలాలు

-

అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితం!

మేషరాశి: అనుకూలత తక్కువ. సోదర విరోధం, ప్రయాణ సూచనలు, మనోచాంచల్యం, అలజడి. వీటి నుంచి ఉపశమనానికి ఇష్టదేవతారాధనతోపాటు దగ్గర్లోని దేవాలయ సందర్శన చేసుకుని పనులు ప్రారంభించండి.

వృషభరాశి: ఆకస్మిక ధనలాభం, ప్రయాణనష్టం, ప్రభుత్వ పరంగా కార్యనష్టం, చిన్నచిన్న ఇబ్బందులు అయినా అధిగమిస్తారు. ఆంజనేయస్వామి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది.

మిధునరాశి: ధనవ్యయం, మిత్రుల వల్ల కొన్ని ఇబ్బందులు, కుటుంబంలో మంచి వాతావరణం. దుర్గాదేవిని ఆరాధించండి మంచి జరుగుతుంది.

కర్కాటకరాశి: మిత్రుల కలయిక, కుటంబంలో ప్రతికూల వాతావరణం, పనుల్లో జాప్యం. వీటి నివారణకు నవగ్రహ ప్రదక్షిణ, శివపూజ చేసుకోండి.

సింహరాశి: బంధుమిత్రుల సహకారం, నూతన వ్యక్తుల పరిచయం, వ్యాపారంలో కొన్ని సమస్యలు, కుటుంబంలో సంతోషకర స్థితి. మంచి ఫలితాల కోసం ఇష్టదేవతారాధన చేసుకోండి.

కన్యారాశి: రాజకీయ రంగంలో వారికి మంచిరోజు, అధిక ఖర్చులు, వాదాలకు దూరంగా ఉండండి. మరిన్ని మంచి ఫలితాలకోసం శనివార నియమం పాటించండి లేదా ఆంజనేయస్వామి దేవాలయం సందర్శించండి.

తులారాశి: మంచి సమయం. ఆకస్మిక ధనలాభం, దైవసందర్శన. సానుకూల సమయం. గౌరవ మర్యాదలు లభిస్తాయి.


వృశ్చికరాశి: ఆందోళన, ఆటంకాలు, ఇబ్బందులు, ప్రతికూల వాతావరణం. ఈరోజు ఇబ్బందులను అధిగమించడానికి ఆంజనేయస్వామి దేవాలయ సందర్శన,ప్రదక్షిణలు, వేంకటేశ్వరస్వామికి పూజ చేయండి.

ధనస్సురాశి: మిత్రుల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. ధనవ్యయం, చిన్నచిన్న సమస్యలు ఉన్నా అధిగమిస్తారు. ఇష్టదేవతారాధన చేసుకోండి.

మకరరాశి: అనుకూలమైన రోజు, బంధుమిత్రుల సహకారం, స్త్రీమూలకంగా విజయం. సానుకూల ఫలితాలు. ఇష్టదేవతారాధన మంచిది.
కుంభరాశి: దైవదర్శన అవకాశం, వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవాలి. నూతన వస్త్రలాభం, ఊహించని సంఘటనలు. మంచి ఫలితాల కోసం రావిచెట్టు ప్రదక్షిణం చేయండి.

మీనరాశి: దేవాలయ సందర్శనం, ఆనందం, సానుకూల ఫలితాలు, చేసే పనులలో అందరూ సహకారం అందిస్తారు. ఇష్టదేవతారాధన చేసుకోండి.

నోట్:

ఆయా రాశులకు ఇచ్చే పరిహారాలలో దేవాలయ సందర్శన వీలుకాని వారు ఇంట్లోనైనా ప్రాతఃకాలంలో ఆయా దేవుళ్లకు సంబంధించిన స్ర్తోత పఠనం లేదా క్యాసెట్స్/యూట్యూబ్‌లలో శ్రవణం చేసినా ఫలితం వస్తుంది. ఇది కలికాలంలో మానవునకి దేవుడిచ్చిన వరం. శ్రవణం/పఠనం/ కీర్తనం అన్ని సమాన ఫలాలను ఇస్తాయి. అయితే శ్రద్ధ, భక్తి ముఖ్యం.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version