కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఈ సంవత్సరం చివరి నాటికి రైతులకు చేరుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వ్యవసాయ ఆధారిత సేవలన్నీ అంతరాయం లేకుండా పొందేందుకు రైతుల కోసం ప్రభుత్వం ఒక 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను తీసుకు రానుంది. దేశవ్యాప్తంగా 5.5 కోట్ల రైతులకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ సేకరించడం జరిగింది. అలానే డిసెంబర్ నాటికి 8 కోట్లకు పెంచాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు.
ఆ డేటాబేస్‌లో 8 కోట్ల మంది రైతుల వివరాలు నమోదు కాగానే దాన్ని స్టార్ట్ చెయ్యాలని భావిస్తోంది. పీఎం కిసాన్, భూఆరోగ్య కార్డులు, పీఎం ఫసవల్ బీమా యోజన వంటి వాటి ఆధారంగా డేటాబేస్ చేసారు. అలానే ఏయే రాష్ట్రాలలో అయితే భూపటాల డిజిటలైజేషన్ జరిగిందో ఆ రాష్ట్రాల్లో జీఐఎస్ ఉపయోగిస్తారు.
భూములకు సంబంధించిన జీఐఎస్ డేటా ఉంటే రైతులు కచ్చితమైన సలహాలు పొందగలరని కేంద్ర ప్రభుత్వం అంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంద్రప్రదేశ్ సహా 11 రాష్ట్రాలకు సంబంధించిన సమాచార వ్యవస్థ ఇప్పటికే రూపొందించారు. రానున్న రోజుల్లో తెలంగాణ, కేరళ, పంజాబ్ వంటి చోట్ల కూడా ఏర్పాటు చేయనున్నారు.