రెయిన్ అలర్ట్ : ఈరోజు భారీ వర్షాలు..!

-

తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వానలు జోరందుకున్నాయి. దాదాపు ప్రతిరోజూ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తాజాగా తెలంగాణ లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈరోజు తెలంగాణ లో ఉరుములు, మెరుపుల తో అకస్మాత్తుగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

అంతే కాకుండా ఏపి లోని కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ఉరుములు మెరుపుల తో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఇక నిన్న కూడా తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ తో పాటు రాష్ట్రం లోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిశాయి. ఇక మెదక్ జిల్లా చిట్కుల్ లో 14.08 సెం.మీల వర్షపాతం నమోదైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version