లాక్‌డౌన్, కరోనా కారణంగా యువత ఎక్కువగా పోర్న్ చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారనేది చాలా సర్వేల్లో వెల్లడైంది. ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ ఎక్కువగా అందుబాటులోకి రావడం మరో కారణంగా కనిపిస్తుంది. పోర్న్ ఎక్కువగా చూసేవారిలో అంగస్థంభన సమస్య తీవ్రంగా ఉంటుందని , అశ్లీల వీడియోల చూడటమనేది.. అంగస్తంభన పనితీరుతో ముడిపడి ఉందని పరిశోధకులు అంటున్నారు.
తాజాగా హంగేరీలో జరిపిన అధ్యయనం ప్రకారం పోర్న్ చూడడానికి పౌరులు చెప్పిన 8కారణాలను ప్రచురించారు. మొత్తం శాంపిల్లలో జరుపిన అధ్యయనం ప్రకారం ఈ డేటా తయారు చేసారు. ఇందులో 18ఏళ్ళ నుండి 70ఏళ్ళ వరకు ఆడ, మగ అందరూ ఉన్నారు. మరి వీరందరూ చెప్పిన కారణాలని ఒక్కసారి పరిశీలిస్తే ఈ విధంగా ఉంది. కొందరు టైమ్ పాస్‌గా చూస్తామంటే, లైంగికంగా తృప్తి లేకపోవడమని సమాధానమిచ్చారు.
సర్వేలో వెల్లడైన కారణాలు..
1. బోర్‌గా ఫీలయినప్పుడు లేదా విసుగ్గా ఉన్నప్పుడు పోర్న్ చూడటం. లేదా టైమ్ పాస్ కోసం పోర్న్ చూడటం.. ఏ పనీ లేక ఖాళీగా ఉండి, బోరింగ్ గా అనిపించిన కాలక్షేపానికి పోర్న్ చూస్తున్నారట.
2. మానసిక పరిస్థితి బాగోలేనప్పుడు. పోర్న్ చూడటం వలన ఉల్లాసంగా ఉంటుంది.
3. నిజ జీవితంలో పొందలేని వాటిని చూస్తూ ఎంజాయ్ చెయ్యడం.
4. శృంగార జీవితం సంతృప్తిగా లేకపోవడం. భాగస్వామితో సంతృప్తి లేని కారణంగా పోర్న్ చూస్తూ అనుభూతిపొందటం.
5. శృంగార కోరికలను తెలుసుకోవడానికి.. తరచుగా పోర్న్ చూస్తూ శృంగార పరమైన కోరికలను నిలుపుకోవడానికి.
6. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకతతో, శృంగారంలో కొత్త కొత్త విషయాలు తెలుస్తాయని.
7. పోర్న్ చూస్తూ ఆనంద పడటం, స్వయం తృప్తి చేసుకోవడం కోసం.
8. ఒత్తిడిని తగ్గించునేందుకు మంచి మార్గం పోర్న్ చూడటం
ఐతే ఈ కారణాల్లో అశ్లీల వీడియోలు చూడడం పెద్ద సమస్య కాదు. కానీ కొందరు చెప్పిన కారణాల్లో, పోర్న్ చూడడం సమస్యగా కనిపించింది. ఆ కారణాలేంటంటే,
పోర్న్ చూడడం పనిచేయడంలో ఉత్తమ పద్దతి బయటకి రావడం.నెగెటివ్ ఆలోచనలని దూరం చేసుకోవడానికి.
- నా అవసరాలను తీర్చే కొత్త కొత్త పోర్న్ వీడియోల కోసం వెతుకుతూ ఉండడానికి.
- పోర్న్ చూడకపోతే ఆందోళనగా మారుతుండడం వలన.
- ఉల్లాసాన్ని తెచ్చుకోవడానికి.
- పోర్న్ చూడకపోవడం వల్ల పనులు సరిగ్గా చేయకపోవడం జరుగుతుంటే.
అయితే పోర్న్ చిత్రాలు చూడటం అనేది మానసిక సమస్య మాత్రమే కాదని శారీరకంగా కూడా సమస్యలు వస్తాయంటున్నారు పరిశోదకులు. మోతాదుకు మించి పోర్న్ చూస్తున్నారంటే పిపియు అంటారు. సమస్య పోర్న్ చూడటం అనేది ఎన్నిసార్లు చూస్తున్నారనేదానిపై ఆదారపడి ఉంటుంది. పోర్న్ వినియోగం అనేది ఒత్తిడి తగ్గించుకోవడానికి, లైంగిక ఆనందం మరియు విసుగు నుంచి బయట పడటానికి చేసే ప్రయత్నంలో బాగంగా ఉండొచ్చు.