కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇటీవల గుడ్ న్యూస్ ను చెప్పిన విషయం తెలిసిందే..జీతాల పెంపు పై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..ఈ నెల నుంచి జీతాలు పెరగనున్నాయని అధికారులు స్పష్టం చేశారు.ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతోంది.కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో పే కమిషన్‌ను ఏర్పాటు చేయనుందన్న ప్రచారం జరుగుతోంది.ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతనాల సవరణ, అలవెన్సులు, పెన్షన్ల కోసం కొత్త కమిషన్ ఏర్పాటు కానుందన్నది ఆ ప్రచారం అర్థం. ఈ విషయంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ రాజ్యసభకు తెలిపారు.
పదేళ్ల సుదీర్ఘ కాలం వరకు వేచి ఉండకుండా మ్యాట్రిక్స్‌ను కాలానుగుణంగా సమీక్షించవచ్చని ఏడో పే కమిషన్ ఛైర్మన్ సిఫార్సు చేసినట్టు పంకజ్ చౌదరీ రాజ్యసభకు తెలిపారు. సామాన్యుల బాస్కెట్‌లో ఉండే వస్తువుల ధరల్లో మార్పులను పరిగణనలోకి తీసుకుని Aykroyd ఫార్ములా ఆధారంగా పే మ్యాట్రిక్స్ లో మార్పులు జరుగుతాయని తెలిపారు.
ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ రేట్లను పెంచుతుందా అనే దానిపై మరొక ప్రశ్నకు ప్రతిస్పందిస్తూ, సిమ్లాలోని లేబర్ బ్యూరో అందించిన AICPI-IW డేటా ఆధారంగా డీఏ, డీఆర్ నిర్ణయిస్తామని ఆయన తెలిపారు..మాములుగా ప్రభుత్వ రెండు సార్లు ఈ డీఏ, పెన్షనర్లకు డీఆర్ పెంచుతుంది. జనవరిలో ఓసారి, జూలైలో మరోసారి డీఏ పెరుగుతుంది. ఇప్పటికే జనవరికి సంబంధించిన డీఏ, డీఆర్ పెరిగింది. జూలై 1న డీఏ పెరుగుతుందని ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూశారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ప్రకటన రాలేదు..
ఈ ఏడాది డీఏ పెంచుతుంది. ఈ డేటా ప్రకారం డీఏ 3 శాతం లేదా 4 శాతం పెరుగుతుందని అంచనా. ఈసారి డీఏ 4 శాతం పెరిగితే ఉద్యోగులకు 38 శాతం డీఏ లభించనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు 18 నెలల డీఏ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారు..8 పే కమిషన్ అనేది మరో ఇప్పటిల్లో ఉండదని క్లారిటీ ఇచ్చింది..