గమనిక..బ్యాంకులకు వరుసగా 6 రోజులు సెలవులు!

-

మీకు బ్యాంక్‌లో ఏవైన లావాదేవీలు చేసే పని ఉంటే∙ ఒక తెలుసుకోవాలి. రానున్న వారం రోజుల్లో ఒక్కరోజు మినహా మిగతా ఆరు రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అందువల్ల బ్యాంక్‌ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలి. ముందుగానే బ్యాంకు పనిదినాలను తెలుసుకొని లావాదేవీలు చేపట్టకోండి.

వచ్చే వారం పది రోజుల్లో బ్యాంకులు ఎక్కువ రోజులు క్లోజ్‌లోనే ఉండనున్నాయి. పండుగలు, బ్యాంకు సిబ్బంది సమ్మె నేపథ్యంలో బ్యాంక్‌లో పని ఉన్న వినియోగదారులు బ్యాంకులు ఎప్పుడెప్పుడు పని చేస్తాయో ముందుగానే తెలుసుకోవాలి. తమ సమయం వృథా చేసుకోకండి

 

బ్యాంకులు పనిచేయని రోజులు

ఏపీలో మున్సిపల్‌ ఎలక్షన్ల కారణంగా పలు ప్రాంతాల్లో బ్యాంకులు సెలవు ఉంటుంది. రేపు శివరాత్రి సందర్భంగా బ్యాంకులు పని చేయవు. అంటే బ్యాంకులకు రెండు రోజులు వరుసగా సెలవులు ఉన్నాయి. శుక్రవారం ఒక్క రోజు బ్యాంకులు పని చేస్తాయి.

ఆ మరుసటి రోజు శనివారం, ఆదివారం రెండు రోజులు బ్యాంకులు పని చేయవు. రెండో శనివారం కారణంగా బ్యాంకులు క్లోజ్‌. ఇక ఆదివారం బ్యాంకులు మూసివేసే ఉంటాయి. అంటే మళ్లీ బ్యాంకులకు వరుసగా రెండు రోజులు సెలవులన్నమాట. అంటే కేవలం శుక్రవారం ఒక్క రోజు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి.

తర్వాత సోమవారం, మంగళవారం కూడా బ్యాంకులు సక్రమంగా పని చేసే అవకాశం లేదని చెప్పుకోవాలి. యూనైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్‌ ఈ రెండు రోజులు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ సమ్మెను బ్యాంకులు సిబ్బంది దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అంటే శుక్రవారం ఒక్క రోజు మినహాయిస్తే.. బ్యాంకులు వరుసగా ఆరు రోజులు పని చేయవు అని చెప్పుకోవచ్చు. ఈలోగా మీకు బ్యాంకుల్లో ఏవైన డబ్బుల లావాదేవీలు, వివిధ రకాల పనుగు ఏమైనా ఉంటే ముందుగానే సెలవుదినాలను తెలుసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version