గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ విడుదల.. 2558 జిడిఎస్ పోస్టులు…!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. ఇండియన్ పోస్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ని సవీకరిస్తోంది. గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఛత్తీస్ గఢ్ మరియు కేరళ సర్కిల్స్ లో ఏకంగా రెండు వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనుంది.అధికారక నోటిఫికేషన్ లో వున్న వివరాలు మీకోసం… మరి ఇక ఆలస్యం ఎందుకు వివరాలను పూర్తిగా చూసేయండి.

ఆన్ లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఆఖరి తేదీ ఏప్రిల్ 7. మొత్తం 1137 మరియు 1421 జిడిఎస్ పోస్టులు ఛత్తీస్గఢ్ మరియు కేరళ సర్కిల్స్ లో భర్తీ చేయనుంది. 18 ఏళ్ల నుంచి నలభై ఏళ్ళు ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. మార్చి ఎనిమిదో తేదీన ఈ నోటిఫికేషన్ వచ్చింది. డాక్ సేవక్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్, బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ ఖాళీలు ఉన్నాయి.

ఇక విద్య అర్హత వచ్చేసి పదవ తరగతి పాస్ అవ్వాలి. మ్యాథ్స్, ప్రాంతీయ భాష మరియు ఇంగ్లీష్ తప్పని సరిగా ఉండాలి. పదో తరగతి వరకు ప్రాంతీయ భాషన తప్పని సరిగా చదవాలి అలానే కంప్యూటర్ విజ్ఞానం తప్పని సరిగా ఉండాలి.

ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ లేదంటే ఏదైనా యూనివర్సిటీ, బోర్డు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్ నుంచి సర్టిఫికెట్ ఉండాలి. లేదు అంటే మెట్రిక్యులేషన్ లేదా 12వ తరగతిలో కంప్యూటర్ సబ్జెక్ట్ చదువుకున్నా చాలు. పరీక్ష ఫీజు యూఆర్/ ఓబీసీ / EWS మేల్ / ట్రాన్స్ మ్యాన్ Rs. 100 ,SC / ST / మహిళలు/ ట్రాన్స్ ఉమెన్ / PWD ఫీజు చెల్లించక్కర్లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version