ఈ ప్ర‌భుత్వ స్కీమ్స్‌ తో మీ డబ్బులని రెట్టింపు చేసుకోండి..!

-

మీరు మీ దగ్గర ఉన్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలని అనుకుంటున్నారా…? అయితే తప్పక మీరు ఈ ప్ర‌భుత్వ స్కీమ్స్‌ గురించి తెలుసుకోవాలి. ఈ స్కీమ్స్ లో కనుక మీ దగ్గర ఉన్న డబ్బులు పెడితే అప్పుడు మీ డబ్బులు డబల్ అవుతాయి. పైగా దీనిలో ఎలాంటి రిస్క్ ఉండదు. కచ్చితమైన లాభం వస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం

National Savings Certificate

ఈ పథకం స్వాతంత్ర్యం వ‌చ్చిన తరువాత ప్రారంభించబడింది. ప్రజల నుండి డబ్బును సేకరించి దేశ అభివృద్ధికి ఉపయోగించాలని అప్ప‌టి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ లక్ష్యం మొత్తం పెట్టుబడిని ద్వార‌ దేశ అభివృద్ధి చేయ‌డం. అదే విధంగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం సర్టిఫికెట్ పథకంలో చేరితో 6.8 శాతం వడ్డీ వస్తుంది. ఇది ఐదేళ్ల స్కీమ్. ఇందులో కూడా పదేళ్లకు మీ డబ్బులు డబల్ అవుతాయి. అదే ఒకవేళ మీరు టర్మ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరితే… 5.5 శాతం వడ్డీ వస్తుంది. మీ డబ్బు 13 ఏళ్లలో రెట్టింపు అవుతుంది. ఒకవేళ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ లో కనుక దబ్బబులని పెడితే.. అప్పుడు మీకు 5.8 శాతం వడ్డీ వస్తుంది. మీ డబ్బు 12 ఏళ్లలో రెట్టింపు అవుతుంది.

సుకన్య సమృద్ధి యోజన పథకం

ప్ర‌భుత్వ స్కీమ్స్‌ Sukanya Samriddhi Yojana

సుకన్య సమృద్ధి యోజన పథకంలో కనుక మీరు డబ్బులని పెట్టారంటే అప్పుడు మీకు 7.6 శాతం వడ్డీ వస్తుంది. మీ డబ్బు 9 ఏళ్లలో రెట్టింపు అవుతుంది. అదే ఒకవేళ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌ లో డబ్బులు పెట్టారంటే 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. అంటే మీ డబ్బు 9.73 ఏళ్లలో రెట్టింపు అవుతుంది.

ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్

Public Provident Fund – incomefinplan

ఇది ఇలా ఉంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ గురించి చూస్తే.. ఈ స్కీమ్ లో కనుక డబ్బులు పెడితే 7.1 శాతం వడ్డీ వస్తుంది. మీ డబ్బు 10 ఏళ్లలో రెట్టింపు అవుతుంది. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ లో కనుక మీరు మీ డబ్బులని పెడితే 6.6 శాతం వడ్డీ వస్తుంది. మీ డబ్బు పదేళ్లలోనే రెట్టింపు అవుతాయి.

పిపిఎఫ్ ఖాతాను తెరవగల బ్యాంకుల జాబితా

  • ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు
    • యాక్సిస్ బ్యాంక్
    • ఐసిఐసిఐ బ్యాంక్
    • హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
  •  ప్రభుత్వ రంగ బ్యాంకులు
    • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    • పిఎన్‌బి
    • కెనరా బ్యాంక్
    • ఇండియన్ బ్యాంక్
    • బ్యాంక్ ఆఫ్ ఇండియా
    • బ్యాంక్ ఆఫ్ బరోడా
    • అలహాబాద్ బ్యాంక్
    • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    • కార్పొరేషన్ బ్యాంక్
    • దేనా బ్యాంక్
    • ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
    • సిండికేట్ బ్యాంక్
    • యుకో బ్యాంక్
    • యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    • విజయ బ్యాంక్
    • ఐడిబిఐ బ్యాంక్

Read more RELATED
Recommended to you

Exit mobile version