బస్సు ప్రయాణం చేసే వారికి బ్యాడ్ న్యూస్. తెలంగాణలో మరో సారి బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. దీనితో ప్రయాణికులకు మరెంత కష్టం అవుతుంది. ఛార్జీల పెరుగదలకు ఆర్టీసీ రెడీ అవ్వగా…. ఎంత పెంచాలన్న అంశం కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా కరోనాకి ముందు ఓసారి భారీగా ఆర్టీసీ ఛార్జీలు పెంచడం అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు మళ్ళీ ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ అధికారులు సిద్ధం అయ్యారు.
ఇలా వివిధ కారణాల వలన మరోసారి కిలోమీటర్‌కి 15 పైసలు చొప్పున పెంచాలని ఆర్టీసీ భావిస్తున్నట్లు తెలిసింది. సంవత్సరానికి రూ.800 కోట్ల భారం ప్రయాణికులపై పడనుంది. అయితే ఏడాదిన్నర కిందటేగా ఛార్జీలు భారీగా పెంచారు మరోసారి ఎందుకు పెంచారు అని ప్రజలు ప్రశ్నిస్తుంటే కరోనా కారణంగా తాము కూడా కష్టాలు పడుతున్నామని చెబుతున్నారు. అలానే ఎంతో మంది ఉపాధిని కూడా కోల్పోయారని అంటున్నారు. అయితే సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఛార్జీలు పెరగనున్నాయి. అప్పటి దాక ఇది ప్రశ్నార్ధకమే ..!