ప్రజల అభివృద్ధి కోసం కేంద్రం వరుస గుడ్ న్యూస్ లను అందిస్తుంది.తాజాగా విద్యార్థులకు మరో శుభవార్తను చెప్పింది.యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా (వైఏఎస్‌ఏఎస్‌వీఐ) స్కీమ్‌లో భాగంగా స్కాలర్ షిప్ అందించేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు..మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టీస్ అండ్ ఎంపవర్‌మెంట్ విద్యార్ధులకు సువర్ణ అవకాశాన్ని కల్పించింది.
ఈ స్కాలర్‌షిప్ లకు ఎంపిక విధానం:
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కాలర్ షిప్‌లో విద్యార్ధులు అర్హత పొందాలంటే విద్యార్ధులు తల్లిదండ్రులు, లేదంటే వారి గార్డియన్ (సంరక్షకు)ల వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షలకు మించకూడదు..
ఎలా అప్లై చేసుకోవాలి..
పీఎం వైఏఎస్‌ఏఎస్‌వీఐ స్కాలర్ షిప్‌లో విద్యార్ధులు అప్లయ్ చేయాలంటే అధికారిక వెబ్‌సైట్ yet.nta.ac.in సందర్శించాల్సి ఉంటుంది. జులై 27నుంచి ఆగస్టు 26వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ దిద్దుబాటు విండో ఆగస్టు 27 నుండి 31 వరకు ఓపెన్ చేసి ఉంటుంది..
పీఎం వైఏఎస్‌ఏఎస్‌వీఐ స్కాలర్‌షిప్ దరఖాస్తు కోసం విద్యార్ధులు కాంటాక్ట్ నెంబర్ ఆధార్ నంబర్, ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే వైఏఎస్‌ఏఎస్‌వీఐ ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా విద్యార్థులు స్కాలర్‌షిప్ కోసం ఎంపిక చేయబడతారు. సెప్టెంబరు 11న కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో ప్రవేశపరీక్ష నిర్వహించబడుతుంది.దానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ సెప్టెంబర్ 5 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..