7th Pay Commission : ఉద్యోగులకు మోడీ సర్కార్ శుభవార్త చెప్పబోతోంది. డియర్ నెస్ అలవెన్స్, డియర్ నెస్ రిలీఫ్ ని మళ్లీ పెంచడానికి కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రతీ ఏటా రెండు సార్లు సవరిస్తూ ఉంటుంది. జనవరిలో మార్చాల్సి ఉండగా మార్చి, సెప్టెంబర్ లేదా అక్టోబర్ కి సవరిస్తోంది. కానీ బకాయిలతో కలిసి జనవరి జూలై 1 నుంచి అమలు చేస్తూ ఉంటాయని చెప్పవచ్చు. చివరిసారి ఈ ఏడాది మర్చిలో డీఏని 46% నుంచి నాలుగు శాతం పెంచి 50 శాతానికి కేంద్రం చేర్చడం జరిగింది. ఇంకోసారి పెంచనున్నారు. ఎంత పెంచవచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
కార్మిక మంత్రిత్వ శాఖ కేంద్ర లేబర్ బ్యూరో ప్రతి నెలా ఈ గణాంకాలను విడుదల చేస్తూ ఉంటుంది. డీఏని ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు చేపడతారు. డీఏ, డీఆర్ పెంపుతో 48 లక్షల మంది ఉద్యోగులకు, 68 లక్షల మంది వరకు పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. అక్టోబర్ డీఏను 42% నుంచి 46% కి చేర్చగా మార్చిలో 46 నుంచి 50% పెంచారు.
ద్రవ్యోల్బణం లెక్కల ప్రకారం డీఏ అనేది 53.35 శాతానికి చేరాల్సి ఉంది కానీ రౌండ్ ఫిగర్ గా 50 నుంచి 53 శాతానికి చేర్చబోతున్నట్లు తెలుస్తోంది. ఈ డీఏ పెంపు గురించి అతి త్వరలోనే కేంద్రం ఒక ప్రకటనని విడుదల చేసే అవకాశం కనబడుతోంది. 50% డిఏ ప్రకారం 27,600 డీఏ రూపంలో వచ్చేది ఇప్పుడు 53 శాతానికి చేరితే 29256 అవుతుంది