ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO గురించి అందరికీ తెలిసినదే. అయితే ఈపీఎఫ్ విత్డ్రా క్లెయిమ్ రిజెక్షన్ కి గల కారణాలు అనేది ఇప్పుడు చూద్దాం.
బ్యాంక్ డీటెయిల్స్:
ఈపీఎఫ్ విత్డ్రావాల్ క్లెయిమ్ అవ్వక పోడానికి కారణాలు చాలా ఉన్నాయి వీటిలో ఒకటి ఏమిటంటే బ్యాంక్ డీటెయిల్స్ ని అప్డేట్ చేయకపోవడం. బ్యాంక్ ఎకౌంట్ నెంబర్ ని అప్డేట్ చేయక పోవడం మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ ని అప్డేట్ చేసుకోకపోతే క్లెయిమ్ చేసుకోవడం అవ్వదు.
తప్పు నంబర్ :
ఒకవేళ ఈపీఎఫ్ ఖాతాదారులు రికార్డులో ఉన్న నెంబర్ తో ఈ నెంబర్ మ్యాచ్ అవ్వకపోతే కూడా క్లైమ్ చేసుకోవడానికి అవ్వదు. అలానే మీ పేరు, డేట్ అఫ్ బర్త్ కూడా సరైనవి ఉండేటట్లు చూసుకోండి.
చెక్ బుక్ డీటెయిల్స్:
ఒకవేళ చెక్ బుక్ కాపీ కానీ సంతకం కానీ క్లియర్ గా లేకపోతే కూడా క్లెయిమ్ చేసుకోవడం అవ్వదు సంతకం సరిగ్గా ఉండాలి మరియు రికార్డ్ లో కూడా మ్యాచ్ అవ్వాలి లేకపోతే క్లైమ్ రిజెక్ట్ అవుతుంది.
ఈపీఎఫ్ విత్డ్రావాల్ క్లెయిమ్ ని ఆన్లైన్లో కస్టమర్లు క్లెయిమ్ చేసినప్పుడు స్కాన్ కాపీని ప్రొవైట్ చేయాలి.
పూర్తి చేయని కేవైసీ:
కేవైసి ని పూర్తి చేయకపోతే కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అవ్వదు. కేవైసీ కనుక పూర్తి చేయకపోతే ఈపీఎఫ్ విత్డ్రావాల్ క్లెయిమ్ ని ఈపీఎఫ్ఓ రిజెక్ట్ చేస్తుంది. ఒకవేళ కరోనా వైరస్ కి సంబంధించి దావా వేయాలని అనుకునేవాళ్ళు ఆధార్ కార్డు వెరిఫై అయ్యేటట్టు చూసుకోండి మరియు మీ UN నెంబర్ కి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంటేలా చూసుకోండి లేకపోతే రిజెక్ట్ అవుతుంది.