ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ వుందా…? అయితే తప్పకుండ తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చెయ్యండి. గతంలో 2021 జూన్ 1 గడువు అని అన్నారు. కానీ తరవాత యాజమాన్యాలు ఉద్యోగుల పీఎఫ్ జమ చేయడంలో ఇబ్బందులు రావడంతో ఈ గడువును 2021 సెప్టెంబర్ 1 వరకు పొడిగించింది. అయితే మరో సారి ఆ గడువుని సెప్టెంబర్ నుండి డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించింది.
దీనిని స్వయంగా ఈపీఎఫ్ఓ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఒకవేళ మీరు డిసెంబర్ నెలాఖరు లోగా మీ ఈపీఎఫ్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేసుకోండి. లేదు అంటే మీ ఈపీఎఫ్ ఖాతాలోకి యాజమాన్య వాటా చెల్లింపులు నిలిచిపోతాయి. అలానే అత్యవసరాల కోసం ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదు విత్ డ్రాయల్ చేసుకోవడంలోనూ ఇబ్బందులు వచ్చే ఛాన్స్ వుంది. ఈపీఎఫ్‌వో సేవలను కూడా ఉపయోగించుకోలేరు కూడా. ఇక ఎలా లింక్ చేసుకోవాలి అనేది చూస్తే..
దీని కోసం ముందుగా ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ఓపెన్ చేయాలి.
నెక్స్ట్ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ తో లాగిన్ అవ్వండి.
Manage ఆప్షన్ అని ఇక్కడ ఉంటుంది. దానిని మీరు క్లిక్ చేయాలి.
ఇక్కడ మీకు KYC ఆప్షన్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చెయ్యండి.
న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. దానిలో Aadhaar సెలెక్ట్ చేయాలి.
ఇక్కడ మీరు మీ పేరు, నెంబర్ ఎంటర్ చేయాలి. అయితే ఆధార్ లో వున్నట్టే వ్రాయండి.
ఆ తర్వాత Save పైన క్లిక్ చేయాలి. అప్రూవ్ అయిన తర్వాత Verified అని వస్తుంది అంతే.