మీ ఆధార్ నంబర్ సరైనదో కాదో ఇలా తెలుసుకోండి..!

-

ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. అయితే ఆధార్ కి 12 అంకెలు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ 12 అంకెలు ఉన్నంత మాత్రాన అది ఆధార్ నెంబర్ కాదంటోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. ఏదైనా ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ నెంబర్ తీసుకున్నట్టైతే ఆ ఆధార్ నెంబర్‌ను వెరిఫై చేయాలని యూఐడీఏఐ కోరుతోంది. దీనితో మోసాలని కూడా ఆపవచ్చు.

ఆధార్ నెంబర్ /Aadhaar number

ఆధార్ వెరిఫై ఇలా చేయచ్చు:

ముందు UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చెయ్యండి.
నెక్స్ట్ హోమ్ పేజీలో My Aadhaar సెక్షన్‌లో Aadhaar services లిస్ట్‌లో Verify an Aadhaar Number పైన క్లిక్ చెయ్యండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
లేదు అంటే మీరు డైరెక్ట్ గా https://resident.uidai.gov.in/ లింక్ ఓపెన్ చేసినా వెరిఫికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు మీరు 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
నెక్స్ట్ మీరు క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి Proceed to Verify పైన క్లిక్ చెయ్యండి.
గ్రీన్ టిక్‌తో Aadhaar Number xxxxxxxxxxxx Exists అని కనిపిస్తే ఆధార్ నెంబర్ యాక్టీవ్‌లో వుంది అని.

ఇలా ఈజీగా మీరు ఆ ఆధార్ నెంబర్ యాక్టీవ్‌లో ఉందా లేదా డీయాక్టివేట్ చేశారా అసలు అది ఆధార్ నెంబరేనా కాదా అన్న విషయం తెలుసుకోచ్చు. అదే మీరు ఆఫ్ లైన్ మోడ్ లో చూడాలంటె ఆధార్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.

ఆధార్ డీయాక్టివేట్ ఎప్పుడు అవుతుంది..?

కొన్ని సందర్భాల్లో ఆధార్ నెంబర్ డీయాక్టివేట్ అవుతుంది. ఒకవేళ వరుసగా మూడేళ్లు ఆధార్ నెంబర్ ఎక్కడా ఉపయోగించకపోయినా డీయాక్టివేట్ అవుతుంది.

అలానే ఐదేళ్ల లోపు పిల్లలు ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు ఐదేళ్ల వయస్సు దాటగానే ఓసారి, 15 ఏళ్ల వయస్సు దాటగానే మరోసారి బయోమెట్రిక్స్ అప్‌డేట్ తప్పక చేయాలి. పిల్లలు తమ బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేయించకపోయినా కార్డు డీయాక్టివేట్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version