డ్రైవింగ్‌ లైసెన్స్కు ఇలా అప్లై చేయండి!

-

మీకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలనుకుంటున్నారా? అయితే ఆన్‌లైన్‌లో ఇలా దరఖా స్తు చేసుకోండి. దీని కోసం మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి. దీనికి ముందుగా మీరు లెర్నింగ్‌ లైసెన్స్‌ తీసుకోవాలి.
ఆ తర్వాత పర్మనెంట్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. టూ వీలర్, ఫోర్‌ వీలర్‌కు లైసెన్స్‌ తీసుకోవాలి. అదేవిధంగా హెవీ వెహికల్స్‌కి కూడా లైసెన్స్‌లు పొందవచ్చు. ఈ డ్రైవింగ్‌ లైసెన్స్‌లను మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ జారీ చేస్తుంది. ఈ లైసెన్స్‌ పొందినవారే వాహనాలు నడపడానికి అర్హులు. అలాగే లైసెన్స్‌ లేకుండా వాహనాలని నడిపితే చట్ట విరుద్ధం.

వేర్వేరు రాష్ట్రాకు సంబంధించిన వెబ్‌సైట్లు ఉంటాయి. 18 సంవత్సరాలు దాటిన వారు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందటానికి ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 55 సీసీ మోటార్‌ సైకిల్‌ ఇంజిన్‌ కెపాసిటీ కన్నా తక్కువ ఉండాలి. ట్రాన్స్‌పోర్టు వాహనం నడపడానికి 20 ఏళ్ల వయస్సు ఉండాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం వయస్సు ధ్రువీకరణకు పాన్‌ కార్డ్, బర్త్‌ సర్టిఫికెట్, పాస్‌పోర్టు, అడ్రస్‌ ధ్రువీకరణకు ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు అవసరం. లెర్నింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు రుసుము చెల్లించాలి.

ఫామ్‌ 1, 1ఏతో పాటు ప్రభుత్వ డాక్టర్‌ సర్టిఫై చేసిన మెడికల్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలి.
ఆన్‌ లైన్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేయాలంటే సంబంధిత రాష్ట్రానికి చెందిన రవాణా శాఖ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి. తెలంగాణకు చెందిన వారు http://www.transport.telangana.gov.in/వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

  • అందులో మొదటగా పేరు, పుట్టిన తేదీ, అడ్రస్‌ లాంటి వివరాలు ఎంటర్‌ చేయాలి. వయస్సు, అడ్రస్‌ ప్రూఫ్స్‌ సబ్మిట్‌ చేయాలి.
  • లెర్నర్‌ లైసెన్స్‌ టెస్ట్‌ కోసం స్లాట్‌ కూడా బుక్‌ చేయవచ్చు.
  • ఆఫ్‌లైన్‌ లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం దగ్గర్లోనే ఆర్‌టీఓ ఆఫీసులో దరఖాస్తు ఫామ్‌ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్‌ జతచేయాలి.
  • ఆర్‌టీఓ కార్యాలయంలో దరఖాస్తు ఫామ్‌ సబ్మిట్‌ చేయాలి. లెర్నర్‌ లైసెన్స్‌ టెస్ట్‌ కోసం అధికారులు స్లాట్‌ కేటాయిస్తారు.
  • టెస్ట్‌ పాస్‌ అయిన తర్వాత లెర్నర్‌ లైసెన్స్‌ పర్మనెంట్‌ అడ్రస్‌కు వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version