మీకు LIC పాలసీ ఉందా…? అయితే మీకు శుభవార్త..!

-

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC వివిధ స్కీమ్స్ తో చక్కటి ప్రయోజనాలని ఇస్తోంది. చాలా మంది పాలసీలు తీసుకుంటూ వుంటారు. ఐతే ఒకవేళ కనుక డబ్బులు కట్టకపోతే పాలసీ యాక్టివ్ గా ఉండదు. ప్రీమియం రెగ్యులర్‌గా చెల్లిస్తే ఎల్ఐసీ పాలసీ యాక్టీవ్‌గా ఉంటుంది. ప్రీమియం చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. ల్యాప్స్ అయిన పాలసీతో బీమా బెనిఫిట్స్ ఉండవు. కనుక ల్యాప్స్ అవ్వకుండా చూడాలి.

ఒకవేళ కనుక పాలసీ ల్యాప్స్ అయితే రివైవ్ చేసుకోవచ్చు. ఐతే ఈ క్యాంపైన్ రెండు నెలల పాటు ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఎల్ఐసీ పాలసీ రివైవల్ క్యాంపైన్ ప్రకటించింది. 2021 ఆగస్ట్ 23న ఈ క్యాంపైన్ ప్రారంభమైంది. 2021 అక్టోబర్ 22 వరకు పాలసీ రివైవల్ క్యాంపైన్ కొనసాగుతుంది. ఐతే ఈ రెండు నెలలు పాలసీ హోల్డర్లు ల్యాప్స్ అయిన తమ పాలసీలు రివైవ్ చేసుకోవచ్చు.

ఐతే వీటిలో ఆఫర్లు కూడా వున్నాయి. రూ.1,00,000 లోపు ప్రీమియంపై ఆలస్య రుసుములో 20 శాతం లేదా రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అదే రూ.1,00,000 నుంచి రూ.3,00,000 వరకు ప్రీమియంపై ఆలస్య రుసుములో 25 శాతం లేదా రూ.2,500 వరకు తగ్గింపు లభిస్తుంది.

రూ.3,00,000 కన్నా ఎక్కువ ప్రీమియంపై ఆలస్య రుసుములో 30 శాతం లేదా రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇది ఇలా ఉంటే మొదటి ప్రీమియం చెల్లించని నాటి నుంచి ఐదేళ్లలో పాలసీ రివైవ్ చేయొచ్చు. టర్మ్ పూర్తి కాని పాలసీలనే రివైవ్ చేయొచ్చు. పాలసీ టర్మ్ పూర్తైతే ల్యాప్స్ చేయడం కుదరదు. హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ, మైక్రో ఇన్స్యూరెన్స్ ప్లాన్స్ కూడా రివైవ్ చేయొచ్చు. ఇలా ఇన్సూరెన్స్ లాభాలు కోల్పోకుండా చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version